Jani Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరికొద్ది రోజులు జైలులోనే ఉండాల్సి రానున్నది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్టయి.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. అక్టోబర్ 7న విచారించనున్నట్లు తెలిపింది. జానీ బెయిల్‌పై నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫ్టాస్ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కొరియోగ్రాఫర్‌కి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసు విచారణ దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు విచారణను వాయిదా వేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో చంచల్‌గూడ జైలులో ఉన్నారు.