Israel | ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్‌పై వరుస దాడులకు దిగుతున్నది. ఇప్పటికు హిజ్బొల్లాకు చెందిన కీలక నేతలను హతమార్చింది. తాజాగా హమాస్‌కు చెందిన లెబనాన్ చీఫ్ ఫతే షెరీఫ్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన ఖచ్చితమైన దాడిలో ఉగ్రవాద సంస్థ హమాస్ లెబనాన్ అధిపతి ఫతే షెరీఫ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. షెరీఫ్ హిజ్బొల్లాతో కలిసి పని చేసేవాడని.. ఉగ్రవాదలను రిక్రూట్ చేసుకునేవాడని పేర్కొంది.
ఫతే షెరీఫ్ లెబనాన్‌లో హిజ్బొల్లాతో కలిసి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తుండేవాడని.. లెబనాన్‌లో కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం, ఆయుధాలను సమకూర్చడంలో సహాయం అందించేవాడని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు ముప్పు తలపెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఫతే షెరీఫ్ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీలో గుర్తింపు పొందిన సభ్యుడని.. లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ టీచర్స్ యూనియన్‌కు అధిపతి ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్ స్టేట్ పౌరులకు ముప్పు కలిగించే ఎవరికైనా వ్యతిరేకంగా ఐడీఎఫ్, ఐఎస్ఏ చర్యలు తీసుకోవడం కొనసాగిస్తాయని పేర్కొంది.