Virat kohli – BCCI | టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై బీసీసీఐ స్పందించింది. తన నాయకత్వ లక్షణాలతో టీమిండియాను కోహ్లీ ఉన్నత శిఖరాలకు చేర్చాడని కితాబిచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపిన బీసీసీఐ.. టెస్ట్ క్రికెట్లో కోహ్లీ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రాణించాడని పేర్కొంది. 68 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి 40 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడని పేర్కొంది.
ఇప్పటికే వన్డే, టీ20ల కెప్టెన్సీ వదులుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఏడేండ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని.. కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే తనను నమ్మి ప్రోత్సహించిన రవిశాస్త్రి, ఎమ్మెస్ ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై
మళ్లీ నిర్బంధంలోకి జకోవిచ్.. ఎందుకో తెలుసా..?
భీమ్లా నాయక్ రిలీజ్‌పై మరోసారి క్లారిటీ.. అదిరిపోయిన నయా పోస్టర్