IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఎలా ఉండనుంది? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లలో తిరుగుతోంది. ఫ్రాంచైలకు ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి అనుమతిస్తారు? మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆడుతాడా? అని అభిమానులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యం పాత రిటెన్షన్ విధానాన్ని (Retention Policy) తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లను ఐదేండ్ల పాటు రీటైన్ చేసుకొనే నియమాన్ని మళ్లీ తెరపైకి రానుందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అదే జరిగితే.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోనీ మరో సీజన్ ఆడేందుకు ఏ అభ్యంతరం ఉండదు.
భారత మాజీ సారథి అయిన ధోనీ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి పూర్తిగా ఐపీఎల్‌కే అంకితమయ్యాడు. ఐపీఎల్ పాత నిబంధన ప్రకారం ధోనీని 2026 వరకూ అట్టిపెట్టుకునే వీలుంది. అందుకని సీఎస్కే ఈ రూల్‌ను మళ్లీ తేవాలని బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యాన్ని కోరుతోంది. దాంతో, బీసీసీఐ కూడా అందుకు సిద్దంగానే ఉన్నట్టు వినికిడి.
BCCI is Likely to bring back the rule which puts the players retired from International cricket for at least 5 years in the “Uncapped” category…!!!! [Sahil Malhotra from News18]
– If this rule returns, CSK can retain Dhoni as an Uncapped player. pic.twitter.com/0jjUkXouwu
— Johns. (@CricCrazyJohns) August 16, 2024
ఐపీఎల్లో కింగ్ మేకర్‌గా పేరొందిన ధోనీ 16వ సీజన్లో సీఎస్కేను మరోసారి చాంపియన్‌గా నిలిపాడు. అందరూ ఊహించినట్టే 17వ సీజన్‌కు ముందు తాల పగ్గాలు వదిలేశాడు. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను ప్రకటించి వికెట్ కీపర్‌గా కొనసాగాడు. అయితే.. అతడు మరో సీజన్ ఆడడంపై సందేహాలు ఉన్నాయి. 41 ఏండ్ల వయసులోనూ ఫిట్‌గా ఉన్న ధోనీ 18వ సీజన్లో కొత్త అవతారంలో చెన్నైకి అండగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.