తెలంగాణ చరిత్రతో ‘క్యూఆర్’ శాలువా
సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ క్యూఆర్ కోడ్‌తో వినూత్నమైన శాలువా రూపొందించారు.
- సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ఘనత
- స్కాన్ చేస్తే సమస్త తెలంగాణ చరిత్ర సమాచారం వీక్షణం
- హైదరాబాద్ నందినగర్‌లో ఆవిష్కరించిన కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్: సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ క్యూఆర్ కోడ్‌తో వినూత్నమైన శాలువా రూపొందించారు. కోడ్‌పై క్లిక్ చేస్తే.. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, సంప్రదాయాలు, కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలు, మిషన్ భగీరథ, కాళేశ్వరం గొప్పతనం వీక్షించేలా తయారు చేశారు. ఈ శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో శనివారం ఆవిష్కరించారు. ‘పోగు బంధంతో ఫోన్ బంధం’ అనే కాన్సెప్ట్‌తో 15 రోజుల వ్యవధిలోనే అద్భుతమైన శాలువాను తయారు చేసిన విజయ్‌కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధిని చాటిచెప్పేందుకే
క్యూఆర్ కోడ్ శాలువా ఆవిష్కరణ సందర్భంగా నల్ల విజయ్‌కుమార్ మాట్లాడుతూ ‘మా నాన్న గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. నేను గతంలో రంగులు మారే చీరను, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణకు కేసీఆర్ చేసిన అభివృద్ధిని, మన వారసత్వ సంపదను పది మందికి తెలియజేయాలనే ఆలోచనతోనే క్యూఆర్ కోడ్ శాలువాను రూపొందించాను. సిరిసిల్ల ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు అడ్డా అని నిరూపించడమే నా లక్ష్యం. నేతన్నకు కేటీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాను’ అని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

