అహద్మాబాద్: కోల్‌కతా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార సంఘటనను ఖండిస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసన సందర్భంగా మాట్లాడిన ఒక డాక్టర్ గన్ చూపించి అటూ ఇటూ ఊపాడు. (Doctor Waves Gun) ఇది చూసి నిరసనలో పాల్గొన్న వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతరులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్‌పై కేసు నమోదైంది. గుజరాత్‌లోని అమ్రేలీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో నగరంలోని రాజ్‌కమల్ చౌక్ వద్ద పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు, వైద్యులు క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీ ప్రారంభానికి ముందు ప్రైవేటు డాక్టర్ జీజే గజేరా వైద్యులు, వైద్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడాడు. ఈ సందర్భంగా తన లైసెన్స్ పిస్టల్‌ను అందరికీ చూపాడు. దానిని చేతిలో పట్టుకుని అటూ ఇటూ ఊపాడు. ఇది చూసి అక్కడున్న వారు భయాందోళన చెందారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో పోలీసులు స్పందించారు. ప్రజల్లో భయాన్ని సృష్టించే ఉద్దేశంతో లైసెన్స్ గన్ ప్రదర్శించిన ఆ డాక్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.