BCCI | భారీ ఆదాయంపై కన్నేసిన బీసీసీఐ.. టైటిల్ స్పాన్సర్ రైట్స్ టెండర్లకు పిలుపు
BCCI : భారత క్రికెట్ బోర్డు మరోసారి భారీ ఆదాయంపై కన్నేసింది. టైటిల్ స్పాన్సర్ రైట్స్(Title Sponsor Rights)కు బీసీసీఐ ఈరోజు టెండర్లను ఆహ్వానించింది. ప్రముఖ కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జీఎస్టీతో కలిపి రూ. లక్ష చెల్లించిన వాళ్లకు మాత్రమే ఇన్విటేషన్ టు టెండర్(Invitation to Tender)...
BCCI : భారత క్రికెట్ బోర్డు మరోసారి భారీ ఆదాయంపై కన్నేసింది. టైటిల్ స్పాన్సర్ రైట్స్(Title Sponsor Rights)కు బీసీసీఐ ఈరోజు టెండర్లను ఆహ్వానించింది. ప్రముఖ కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జీఎస్టీతో కలిపి రూ. లక్ష చెల్లించిన వాళ్లకు మాత్రమే ఇన్విటేషన్ టు టెండర్(Invitation to Tender) ఫామ్ ఓపెన్ అవుతుందని వెల్లడించింది.
ఒకవేళ టెండర్ దక్కకుంటే కట్టిన డబ్బులు వాపసు ఇవ్వబోమని, ఈ టెండర్ దరఖాస్తు ఆగస్టు 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని నోటిఫికేషన్లో బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. ఆసక్తికల కంపెనీలు పేమెంట్ వివరాలను titlesponsor.itt@bcci.tv మెయిల్‌కు చేయాలని సూచించింది. స్పాన్సర్షిప్ దక్కించుకున్న కంపెనీ ఇకనుంచి బీసీసీఐ అన్ని కార్యక్రమాలకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
🚨BCCI announces the release of Invitation to Tender for Title Sponsor Rights for BCCI Events🚨
The ITT will be available for purchase till August 21, 2023.
More details here 👇https://t.co/AgJYpPPuj0
— BCCI (@BCCI) August 1, 2023
ఈమధ్యే భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులను డ్రీమ్ 11(Dream 11) సంస్థకు కట్టబెట్టింది. అంతుకుమందు పదహారోసీజన్ ఐపీఎల్(IPL 2023) టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను టాటా గ్రూప్(TATA Group)కి కట్టబెట్టడం , తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్(Womens Premiere League) మీడియా హక్కులను వైకోమ్ సంస్థ(VI COM)కు అమ్మడం ద్వారా బీసీసీఐకి కోట్లలో ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.
మహిళల ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణలో ఐదు జట్ల కెప్టెన్లు

తాజాగా జారీ చేసిన టైటిల్ స్పాన్సర్ రైట్స్ టెండర్‌తో ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ బోర్డుకు కోట్లలో డబ్బులు సమకూరనున్నాయి. వారం క్రితమే బీసీసీఐ టీమిండియా 203-24 షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది భారత జట్టు సొంతగడ్డపై 16 మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో ఐదు టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
Pakistan Hockey Team | భారత్‌కు చేరుకున్న పాకిస్థాన్ హాకీ జట్టు.. దాయాదుల పోరు ఎప్పుడో తెలుసా..?
Shai Hope | వెస్టిండీస్ టీ20 జట్టులో వన్డే కెప్టెన్.. ఏడాది తర్వాత మళ్లీ భారత్‌పైనే తొలి మ్యాచ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

