Pakistan Hockey Team : ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్(Asian Champions Trophy Hockey tournament) ఏడో సీజన్ మరో రెండు రోజుల్లో మొదలవ్వనుంది. దాంతో, ఈ పోటీల్లో పాల్గొంటున్న పాకిస్థాన్ హాకీ జట్టు(Pakistan Hockey Team) ఈరోజు భారత్‌కు చేరుకుంది. అత్తారీ – వాఘా సరిహద్దు (Attari-Wagah Border)గుండా మనదేశంలోకి ప్రవేశించిన పాక్ బృందానికి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. ‘ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు మా జట్టు చెన్నైకి వెళ్తోంది. ఈ టోర్నీలో ఆసియా ఖండంలోని అన్ని జట్లు ఆడుతున్నాయి. ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాం.
ముఖ్యంగా, ఆట, సినమాల ద్వారా భారత్, పాకిస్థాన్ మధ్య బంధం పెరుగుతుంది. ఇరుదేశాలు అతిథులను బాగా చూసుకుంటాయి. దాయాదులది పెద్ద మనసు’ అని పాక్ జట్టు కోచ్ ముహమ్మద్ సక్లెయిన్(Muhammad Saqlain) తెలిపాడు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ ఆగస్టు 9న జరుగనుంది.
Punjab: Pakistan Hockey Team players arrive at Attari-Wagah Border, Amritsar ahead of Asian Championships Trophy in Chennai.#HACT2023#asiahockeyfedration pic.twitter.com/85wjSEu9Ng
— Asian Hockey Federation (@asia_hockey) August 1, 2023
ఈ ఏడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీలో ఆసియా దేశాలకు చెందిన ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగనుంది. చెన్నైలోని మేయర్ రాధాకృష్ట స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నారు.
పాక్ బృందానికి ఘన స్వాగతం పలికిన భారత అధికారులు
ఆసియా హాకీ ఫెడరేషన్(Asian Hockey Federation) 2011 నుంచి ఏటా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో ఘనమైన రికార్డు ఉన్న దాయాది జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టు ఆరంభ సీజన్ 2011లో చాంపియన్‌గా నిలిచింది. 2016లోనూ మనజట్టే కప్పు కొట్టింది. 2018లో మాత్రం పాకిస్థాన్‌తో ట్రోఫీని పంచుకుంది. మరోవైపు పాక్.. 2012, 2013లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2021లో దక్షిణ కొరియా జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ విజేతగా అవతరించింది.