Shai Hope | వెస్టిండీస్ టీ20 జట్టులో వన్డే కెప్టెన్.. ఏడాది తర్వాత మళ్లీ భారత్‌పైనే తొలి మ్యాచ్
Shai Hope : కరీబియన్ వన్డే జట్టు కెప్టెన్(ODI Captain) షాయ్ హోప్(Shai Hope) మళ్లీ టీ20ల్లోకి వచ్చాడు. భారత్‌తో 5 టీ20ల సిరీస్‌కు విండీస్ క్రికెట్ బోర్డు అతడిని ఎంపిక చేసింది. రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. దాంతో, ఫామ్‌లో ఉన్న అతడిని టీ20 సిరీస్(T20 Series)లో కూడా ఆడించాలని సెలెక్టర్లు భావించారు. హోప్‌తో పాటు విధ్వంసక ఆటగాళ్లు...
Shai Hope : కరీబియన్ వన్డే జట్టు కెప్టెన్(ODI Captain) షాయ్ హోప్(Shai Hope) మళ్లీ టీ20ల్లోకి వచ్చాడు. భారత్‌తో 5 టీ20ల సిరీస్‌కు విండీస్ క్రికెట్ బోర్డు అతడిని ఎంపిక చేసింది. రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. దాంతో, ఫామ్‌లో ఉన్న అతడిని టీ20 సిరీస్(T20 Series)లో కూడా ఆడించాలని సెలెక్టర్లు భావించారు. విశేషం ఏంటంటే..? 29 ఏళ్ల హోప్ దేశం తరఫున టీ 20 మ్యాచ్ ఆడి ఏడాది కావొస్తోంది. అది కూడా భారత జట్టుపైనే 20 ఓవర్ల ఆటలో కనిపించాడు. మళ్లీ మన టీమ్‌పైనే టీ20 మ్యాచ్ ఆడనున్నాడు.
హోప్‌తో పాటు విధ్వంసక ఆటగాళ్లు షిమ్రాన్ హిట్మెయిర్(Shimron Hetmyer), నికోలస్ పూరన్(Nicholas Pooran)లు కూడా జట్టులోకి వచ్చారు. టీ20 జట్టుకు రొవమన్ పావెల్(Rovman Powell) సారథ్యం వహించనున్నాడు. పొట్టి సిరీస్‌కు విండీస్ 15మంది స్క్వాడ్ ఇదే. ఇరుజట్ల ఆగస్టు 13 నుంచి పొట్టి సిరీస్ జరుగనుంది.
విండీస్ స్క్వాడ్ : రొవ్మన్ పావెల్(కెప్టెన్), కైల్ మేయర్స్(వికెట్ కీపర్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, షిమ్రాన్ హిట్మెయర్, జేసన్ హోల్డర్, షై హోప్, అకేల హొసెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కిగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రొమరియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, ఒషానే థామస్.
ఈ ఏడాది హోప్ కెరీర్లోనే ఉత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అవును.. ఈ మాట అతడి 96.75 స్ట్రయిక్ రేటు చూస్తే అర్థమవుతుంది. 2016 నుంచి ఇప్పటివరకూ ఒక క్యాలెండర్లో 80 స్ట్రయిక్ రేటు కూడా దాటని అతను ఈసారి దుమ్మురేపుతున్నాడు. నాలుగో స్థానంలో జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(Wolrd Cup Qualifiers 2023)లో హోప్ అద్భుతంగా రాణించాడు.
హిట్మెయిర్, నికోలస్ పూరన్

అందులో ఒక సెంచరీ కూడా ఉంది. అయినా కూడా వెస్టిండీస్ ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించలేకపోయింది. రెండు సార్లు చాంపియన్ అయినా ఆ జట్టు మెగా టోర్నీకి క్వాలఫై కాకపోడం 46ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు.. ఈమధ్యే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో హెట్మెయిర్, పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. దాంతో, వీళ్ల చేరికతో విండీస్ జట్టు బ్యాటింగ్ విభాగం మరింతం బలంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
Kapil Dev Vs Jadeja | ఎవరూ తేలిగ్గా తీసుకోవడం లేదు..! కపిల్ దేవ్ వ్యాఖ్యలకు జడేజా కౌంటర్..!
Stuart Broad: టెస్టు కెరీర్‌కు గ్రాండ్‌గా గుడ్‌బై.. స్టువర్ట్ బ్రాడ్ ఖాతాలోకి చివరి వికెట్లు.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

