Stuart Broad: టెస్టు కెరీర్‌కు గ్రాండ్‌గా గుడ్‌బై.. స్టువర్ట్ బ్రాడ్ ఖాతాలోకి చివరి వికెట్లు.. వీడియో
Stuart Broad: టెస్టు కెరీర్‌ను గ్రాండ్‌గా ముగించేశాడు స్టువర్ట్ బ్రాడ్. ఆసీస్‌తో జరిగిన అయిదో టెస్టులో చివరి రెండు వికెట్లను తన ఖాతాలోనే వేసుకున్నాడు. అలెక్స్ క్యారీని ఔట్ చేసి.. కెరీర్ చివరి బంతికి వికెట్ తీసిన ఘనతను దక్కించుకున్నాడతను. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 49 రన్స్‌తో ఆసీస్‌పై నెగ్గింది.
ఓవల్: ఆస్ట్రేలియాతో జరిగిన అయిదో టెస్టులో ఇంగ్లండ్ 49 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో టెస్టు సిరీస్ 2-2 తేడాతో డ్రా అయ్యింది. ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad).. తన చివరి టెస్టు ఆడేశాడు. ఇదే నా చివరి టెస్టు అని శనివారం ప్రకటించిన అతను.. అయిదో టెస్టు ఆఖరి రోజున కీలక దశలో వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు చెందిన చివరి రెండు వికెట్లను పడగొట్టి.. తన టెస్టు కెరీర్‌కు గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పాడు బ్రాడ్.
A fairytale ending for a legend of the game.
Broady, thank you ❤️ #EnglandCricket | #Ashes pic.twitter.com/RUC5vdKj7p
— England Cricket (@englandcricket) July 31, 2023
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓ దశలో 264 రన్స్‌కు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆసీస్.. ఆ తర్వాత అనూహ్యంగా 334 రన్స్‌కు ఆలౌటైంది. రిటైరింగ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. చివర్లో టాడ్ మర్ఫీ, అలెక్స్ క్యారీ వికెట్లను తీసి అంతర్జాతీయ కెరీర్‌ను ముగించేశాడు. ఈ మ్యాచ్‌లో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు.
టెస్టుల్లో వార్నర్‌ను 18వ సారి ఔట్ చేశాడు బ్రాడ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

