BWF Rankings : భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy), లక్ష్యసేన్(Lakshya Sen) బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్(BWF Rankings)లో సత్తా చాటారు. ఈ సీజన్లో అత్తుత్తమ ప్రదర్శన చేస్తున్న ప్రణయ్ 9వ స్థానంలో, లక్ష్యసేన్ 11వ ర్యాంకుకు ఎగబాకారు. ఈమధ్యే ముగిసిన జపాన్ ఓపెన్ సూపర్ 750(Japan Open) బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అదరగొట్టారు. లక్ష్యసేన్ ఏకంగా సెమీస్‌కు దూసుకెళ్లాడు. అయితే.. ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీ(Jonathan Christie) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దాంతో, ర్యాకింగ్ మెరుగుపరుచుకున్నాడు.
మరో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఒక అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం అతను 19వ ర్యాంక్‌లో ఉన్నాడు. నేషనల్ చాంపియన్ మిధున్ మంజునాత్(Mithun Manjunath) ఏకంగా నాలుగు స్థానాలు ఏగబాకి 50 వ ర్యాంక్ సాధించాడు. ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు(PV Sindhu) మహిళల ర్యాంక్సింగ్స్‌లో 17వ స్థానంలో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఆడిన ప్రతి టోర్నమెంట్లో క్వార్టర్స్ కూడా దాటలేకపోయిన ఆమెకు గత పదేళ్లలో ఇదే తక్కువ ర్యాంక్ కావడం గమనార్హం.
పీవీ సింధు
డబుల్స్‌లో ఇరగదీస్తున్న సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj)- చిరాగ్ శెట్టీ(Chirag Shetty) రెండో సీడ్ నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది వీళ్లు కొరియా ఓపెన్‌తో కలిపి మూడు వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించారు. దాంతో, ఈమధ్యే మూడో ర్యాంక్ నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకారు. మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ, గాయత్రీ గోపిచంద్ 17వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.