లండన్: ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సమయం ఆసన్నమైంది. నాలుగు పదుల వయసులో యువ బౌలర్లతో పోటీపడుతున్న అండర్సన్ రానున్న సమ్మర్ సీజన్లో టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలుకబోతున్నాడు. ఇటీవలే భారత పర్యటనలో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న 41 ఏండ్ల అండర్సన్..స్వదేశం వేదికగా వెస్టిండీస్, శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌ల్లో ఆఖరిసారి బరిలోకి దిగనున్నాడు. తన సొంత ఇలాఖా ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అండర్సన్ చివరి మ్యాచ్ ఆడే అవకాశముంది.