BCCI : వన్డే వరల్డ్ కప్ మ్యాచులను మస్తుగా ఆస్వాదించిన అభిమానులకు మరో గుడ్‌న్యూస్. దుబాయ్ గడ్డపై త్వరలోనే అండర్ -19 ఆసియా కప్(Under -19 Asia Cup 2023) షురూ కానుంది. డిసెంబర్ నెలలో జరిగే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ బోర్డు శనివారం 15 మందితో కూడిన 15 మంది బృందాన్ని ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి ఉదయ్ సహరన్(Uday Sahaaran) కెప్టెన్‌గా, సౌమీ కూమార్ పాండే(Saumi Kumar Pandey)లను వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. డిసెంబర్ 8వ తేదీన ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో యువభారత్ డిసెంబర్ 10(ఆదివారం)న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొననుంది.
🚨 NEWS 🚨
India U19 squad for ACC Men’s U19 Asia Cup announced
Details 🔽https://t.co/dZHCSv32a6
— BCCI (@BCCI) November 25, 2023
భారత బృందం : అర్షిన్ కులకర్ణి, ఆదర్ష్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మొలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహరన్(కెప్టెన్), అరవెల్లి అవినాష్ రావు(వికెట్ కీపర్), సైమీ కుమార్ పాండే(వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేశ్ మహాజన్(వికెట్ కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ.
ట్రావెలింగ్ స్టాండ్ బైస్ : ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గొసాయ్, ఎండీ.అమాన్.
రిజర్వ్ ఆటగాళ్లు : దిగ్విజయ్ పటేల్, జయంత్ గొయత్, పి. విఘ్నేష్, కిరణ్ చొరమలే.