న్యూఢిల్లీ: రైలులో వేధించిన వ్యక్తికి ఒక మహిళ బుద్ధి చెప్పింది. అతడి చెంపతోపాటు ప్రైవేట్ భాగాలపై చెప్పుతో కొట్టింది. (Woman Beats Up Man With Slippers) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రైన్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి పక్కన మహిళ కూర్చొంది. అయితే ఆ వ్యక్తి ఆమెను తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ ఆగ్రహంతో రగిలిపోయింది. వెంటనే తన చెప్పుతో ఆ వ్యక్తి చెంపపై పలుసార్లు కొట్టింది. అతడి జుట్టు పట్టుకుని తలపై బాదింది.
కాగా, ఆ మహిళ అంతటితో ఆగక ఆ వ్యక్తి ప్రైవేట్ భాగాలపై కూడా చెప్పుతో కొట్టింది. ఆమె దాడిని తట్టుకోలేని అతడు సీటు నుంచి లేచి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ సీటు పైకి ఎక్కిన మహిళ ఆ వ్యక్తిని మరోసారి చెప్పుతో కొట్టింది. మిగతా ప్రయాణికులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె లెక్కచేయలేదు. ఒక యూజర్ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kalesh b/w a Lady and a Guy inside Indian Railways over this guy was misbehaving with her
pic.twitter.com/JO9g16RVDZ— Ghar Ke Kalesh (@gharkekalesh) November 24, 2023