BCCI | ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం టీమ్ ఇండియా ఆటగాళ్లు దుబాయ్ (Dubai) చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు ఆటగాళ్లంతా నెట్స్‌లో చమటోడుస్తున్నారు. ఈ టూర్లో ఆటగాళ్లకు బీసీసీఐ (BCCI) పది షరతులు పెట్టిన విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో విదేశీ పర్యటనల్లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయం ప్రకారం.. ఆటగాళ్లు కనీసం 45 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు విదేశాలకు వెళ్తేనే.. జట్టులోని సభ్యులతో వారి ఫ్యామిలీలు గరిష్టంగా రెండు వారాల పాటు ఉండేందుకు అనుమతి ఉంటుంది. అయితే, దుబాయ్ పర్యటనకు మాత్రం ఫ్యామిలీని అనుమతించలేదని వార్తలు వచ్చాయి.
అంతేకాదు వ్యక్తిగత సిబ్బందిని కూడా అనుమతించలేదని తెలిసింది. రోహిత్ సేన దుబాయ్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. మొత్తం ఈ పర్యటన వ్యవధి మూడు వారాల కంటే కొంచెం ఎక్కువగా ఉండటంతో.. ఆటగాళ్లతో వారి కుటుంబాలను బీసీసీఐ అనుమతించలేదు. బీసీసీఐ నిర్ణయంతో ఇప్పటి వరకూ విదేశీ పర్యటనలకు కుటుంబాలతో సహా వచ్చిన క్రికెటర్లు ఈసారి సింగిల్స్‌గా రావాల్సి వచ్చింది.
అయితే, తాజాగా ఈ విషయంలో బీసీఐ యూటర్స్ తీసుకున్నట్లు తెలిసింది. ఆటగాళ్లకు కొంత మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెటర్లు కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అయితే, ఓ షరతు పెట్టినట్లు (One Condition) పేర్కొన్నాయి. ట్రోఫీ మొత్తంలో ఏదైనా ఒక మ్యాచ్ కోసం మాత్రమే కుటుంబసభ్యులను అనుమితిస్తారట. ఈ విషయంలో ఆటగాళ్లు చర్చించుకుని బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆటగాళ్ల అభ్యర్థన మేరకు బీసీసీఐ అందుకు తగిన ఏర్పాటు చేస్తుందని క్రికెట్ వర్గాలు వెల్లడించినట్లు మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
Also Read..
BCCI | విరాట్ కోహ్లీకి స్పెషల్ ఫుడ్.. బీసీసీఐ నిబంధనలు క్రికెటర్లకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా?
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం.. కరాచీలో కనిపించని భారత పతాకం
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీ కోసం.. పాకిస్థాన్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు