Bangladesh Super Fan : కాన్పుర్ టెస్టు సందర్భంగా స్టాండ్స్‌లో కుప్పకూలిన బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్ టైగర్ రోబి (Tiger Roby) అలియాస్ రబియుల్ ఇస్లాం ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది. డీహైడ్రేషన్ కారణంగా స్పృహ తప్పిన రోబి ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) బారిన పడ్డాడు. కాన్పూర్‌లో రోబికి టెస్టులు నిర్వహించిన డాక్టర్లు అతడికి క్యాన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దాంతో, టైగర్ రోబి భారమైన హృదయంతో చికిత్స కోసం స్వదేశం పయనమయ్యాడు.
అయితే.. .టైగర్ రోబిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఖండించారు. రోబి 12 రోజుల మెడికల్ వీసాతో భారత్‌కు వచ్చాడని, సెప్టెంబర్ 29న అతడి వీసా గడువు ముగిసిందని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ జట్టుకు వీరాభిమాని అయిన టైగర్ రోబి రెండు టెస్టుల సిరీస్ వీక్షించేందుకు భారత్‌కు వచ్చాడు.
🤡 Bangladeshi fan Tiger Roby
– In Chennai he was openly shouting India=enemy, ICC=BCCI.
– In Kanpur he abused Siraj
Kanpur crowd had it enough and replied him in a language he understands.
Now entire Bangladesh is playing victim card as usual.
pic.twitter.com/A5go15Hmyn— Johns (@JohnyBravo183) September 27, 2024
చెపాక్ టెస్టులో బంగ్లా ఆటగాళ్లను ఉత్సాహపరిచిన అతడు కాన్పూర్‌లోనూ పులిచారల డ్రెస్.. ముఖానికి పుసుపు, నలుపు రంగు మేకప్‌తో మైదానంలోకి వచ్చాడు. అయితే.. అతడు అనుకోకుండా సోయి తప్పడంతో భారత అభిమానులు అతడిపై దాడి చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్(Mohammad Siraj)ను దూషించడం వల్లనే రోబీని ప్రేక్షకులు చితకబాదారంటూ కథనాలు వచ్చాయి.
Feel Sad For Tiger Robi. He Got Trapped In Own Acting.
He Tried His Best To Spread Anti Indian Propaganda And Get Himself Some Limelight
Now Bangladeshi Top Media Pages Youtubers Are Mocking Him For Acting
Those Who Knows Arent Even Bothering To Believe What Nonsense He… pic.twitter.com/whx5Ow9VdC
— বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) September 29, 2024
అయితే.. వైద్య చికిత్స తర్వాత కోలుకున్న టైగర్ రోబి తనను ఎవరు కొట్టలేదని చెప్పాడు. డీహైడ్రేషన్(Dehydration) కారణంగానే తాను స్పృహ తప్పి కింద పడ్డానని, పోలీసులు తనను మోసుకెళ్లి వైద్యం అందించారని తెలిపాడు. దాంతో, అతడిపై వస్తున్న తప్పుడు వార్తలకు బ్రేక్ పడినట్టైంది.