Prashant Kishor | అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం: ప్రశాంత్ కిషోర్
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 2న బీహార్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, నాయకత్వంతో సహా అన్ని వివరాలు ఆ రోజు వెల్లడిస్తానని చెప్పారు.
పాట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 2న బీహార్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, నాయకత్వంతో సహా అన్ని వివరాలు ఆ రోజు వెల్లడిస్తానని చెప్పారు. ‘జన సురాజ్’ పేరుతో బీహార్లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ అక్టోబరు 2న కొత్త పార్టీ ‘జన సూరజ్’తోపాటు నాయకత్వ ప్రకటన గురించి మీరు తెలుసుకుంటారు. నేను నాయకుడిని కాదు. నాయకుడు కావాలని ఎప్పుడూ ఆశించలేదు. అక్టోబర్ 2న ఏర్పాటవుతున్న ఈ పార్టీకి నేనెప్పుడూ నాయకుడిగా ఉండను. ప్రజలు నాయకత్వ పాత్ర పోషించాల్సిన సమయం ఇది’ అని అన్నారు.
కాగా, 2022 అక్టోబర్ 2న చేపట్టిన ‘జన సూరాజ్’ పాద యాత్ర మొదటి దశలో భాగంగా బీహార్లో 60 శాతం ప్రాంతాలను పూర్తి చేసినట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈ యాత్రకు నిర్ణీత రోజులు లేదా కిలోమీటర్ల సంఖ్య లేదన్నారు. ప్రధానంగా మూడు ఉద్దేశాలు నెరవేర్చడం కోసం బీహార్లోని ప్రతి మూలకు వెళ్లాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత కూడా తన పాదయాత్ర ఆగదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. మరో ఏడాది లేదా రెండేళ్ల వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీహార్ సవాళ్లకు పరిష్కారాలతో రెండో దశ యాత్ర ప్రణాళికను 2025 ఫిబ్రవరి లేదా మార్చిలో వెల్లడిస్తానని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

