Under -19 Squad : ఇంగ్లండ్ గడ్డపై దుమ్మురేసిన భారత అండర్ -19 జట్టు త్వరలోనే ఆస్ట్రేలియా (Australia)లో పర్యటించనుంది. సెప్టెంబర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు, రెండు మల్టీ డే మ్యాచ్‌ల కోసం కుర్రాళ్లతో కూడిన టీమిండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ టూర్‌కు నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున బుధవారం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు.
ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా, విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. ఇంగ్లండ్ గడ్డపై మెరుపు సెంచరీతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. అభిజ్ఞాన్, హర్వాన్ష్ వికెట్ కీపర్లుగా స్థానం సంపాదించారు. మరో ఐదుగురిని స్టాండ్ బైగా ఎంపిక చేశారు సెలెక్టర్లు.
🚨 NEWS 🚨
India U19 squad for tour of Australia announced.
The India U19 side will play three one-day games and two multi-day matches against Australia’s U19 side.
Details 🔽 #TeamIndiahttps://t.co/osIWOaFA12
— BCCI (@BCCI) July 30, 2025
భారత అండర్ -19 స్క్వాడ్ : ఆయుష్ మాత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా(వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్(వికెట్ కీపర్), ఆర్ ఎస్ అంబ్రిష్, కనిష్క్ చౌహన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, డీ దీపేశ్, కిషన్ కుమార్, అన్మోల్జిత్ సింగ్, ఖిలాన్ పటేల్, ఉద్దవ్ మోహన్, అమన్ చౌహన్.
స్టాండ్ బై ప్లేయర్స్ : యుధజిత్ గుహ, లక్ష్మణ్, బీ.కే. కిశోర్, అలంక్రిత్ రపొలే, అర్ణవ్ బుగ్గా.