Taipei Open : తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ల పోరాటం ముగిసింది. దాంతో, పతక ఆశలు ఆవిరయ్యాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఆయుష్ శెట్టి (Ayush Shetty), ఉన్నాతి హుడా (Unnati Hooda)లు ఓటమి పాలయ్యారు. తమ తమ విభాగాల్లో అద్భుత విజయంతో పతంకపై ఆశలు రేపిన వీళ్లు.. ఊహించని పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమిచారు.
పురుషుల సింగిల్స్‌లో భారత సీనియర్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను ఇంటికి పంపిన ఆయుశ్.. సెమీస్‌లో స్థానిక ఆటగాడు చౌ థియెన్(Chou Tien Chen) జోరు ముందు నిలవలేకపోయాడు. హోరాహోరీగా తలపడిన ఈ యంగ్‌స్టర్ చివరకు 18-21, 17-21తో మ్యాచ్ చేజార్చుకున్నాడు.
A star in the making. 🌟🇮🇳
At the #TaipeiOpen2025, Unnati Hooda showcased poise, power, and potential beyond her years. From fearless court coverage to mature shot selection, the 16-year-old’s campaign turned heads and raised expectations.
Her dream run may have ended, but it… pic.twitter.com/FppyTxaiaA
— BAI Media (@BAI_Media) May 10, 2025
మహిళల సింగిల్స్‌లో అసమాన విజయాలతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఉన్నాతి కఠినమైన ప్రత్యర్థిని చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హుంగ్ యీ టింగ్‌ను ఓడించింది. అయితే.. అదే జోరును సెమీస్‌లో చూపించలేకపోయింది. జపాన్ షట్లర్ తొమొక మియాజకీతో 43 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 19-21, 11-21తో ఓటమి పాలైంది.