INDW vs AUSW | రీచా సెంచరీ మిస్.. సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
INDW vs AUSW : ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా(Australia)ను చిత్తుగా ఓడించిన అమ్మాయిలు వన్డే సిరీస్‌లో జోరు కొనసాగించలేకపోయారు. వరుసగా రెండో వన్డేలో ఓటమితో కంగారూలకు సిరీస్ సమర్పించుకున్నారు. ముంబైలోని వాంఖడేలో జరిగిన రెండో వన్డేలో,,,
INDW vs AUSW : ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా(Australia)ను చిత్తుగా ఓడించిన అమ్మాయిలు వన్డే సిరీస్‌లో జోరు కొనసాగించలేకపోయారు. వరుసగా రెండో వన్డేలో ఓటమితో కంగారూలకు సిరీస్ సమర్పించుకున్నారు. ముంబైలోని వాంఖడేలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 3 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్య ఛేదనలో రీచా ఘోష్(96) విధ్వంసక ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. దీప్తి శర్మ(24 నాటౌట్) చివరిదాకా పోరాడింది.
కానీ, ఆఖరి ఓవర్లలో ఆసీస్ బౌరల్లు సథర్లాండ్, కిమ్ గార్త్ వరుసగా వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమవ్వగా.. దీప్తి, శ్రేయాంక పాటిల్ చెరొక ఫోర్ బాదారు. దాంతో, స్వల్ప తేడాతో మ్యాచ్ చేజారింది. నామమాత్రమైన మూడో వన్డే జనవరి 3వ తేదీన ఇదే స్టేడియంలో జరుగనుంది.
Ashleigh Gardner conceded just 3 runs to go with a wicket in the penultimate over as Australia win yet another series against India 🇦🇺
👉 https://t.co/lm9x7tLTsS | #INDvAUS pic.twitter.com/GvShdR0pxI
— ESPNcricinfo (@ESPNcricinfo) December 30, 2023
భారీ ఛేదనలో ఓపెనర్లు యస్తికా భాటియా(14), స్మృతి మంధానా(34) ధాటిగా ఆడారు. కిమ్ గార్త్ ఓవర్లో యస్తికా బౌల్డ్ అవడంతో.. ఆ తర్వాత చ్చిన రీచా సాధికారిక ఇన్నింగ్స్ ఆడింది. టెస్టు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన ఆమె హాఫ్ సెంచరీతో విరుచుకుపడింది. మరోవైపు జెమీమా రోడ్రిగ్స్(44) ధనాధన్ ఆడినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(5), అమన్‌జోత్ కౌర్(4) నిరాశపరిచారు. రన్‌రేటు పెరుగుతున్న సమయంలో ధాటిగా ఆడిబోయిన రీచా శతకానికి 4 పరుగుల దూరంలో ఔటైంది. అప్పటికీ భారత్ విజయావకాశాలు ఉన్నా.. పూజా వస్త్రాకర్(8), హర్లీన్ డియోల్(1) విఫలమవ్వడంతో ఆసీస్ గెలుపొందింది.

తొలుత ఆడిన అలీసా హేలీ సేన 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు బాదింది. కెప్టెన్ అలీసా హేలీ(13) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా..యువకెరటం ఫొబె లిచ్‌ఫీల్డ్(63), ఎలిసా పెర్రీ(50) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అర్థ శతకాలతో కదం తొక్కారు. చివర్లో అలనా కింగ్(28 నాటౌట్), తహ్లియా మెక్‌గ్రాత్(24) ధనాధన్ ఆడడంతో ఆస్ట్రేలియా.. టీమిండియాకు భారీ టార్గెట్ నిర్దేశించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టింది.
ఇవి కూడా చదవండి
- Chateshwar Pujara | రంజీ ట్రోఫీకి సన్నద్ధమవుతున్న నయావాల్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియో వైరల్
- Jagadish Reddy | అప్పుల్లేని రాష్ట్రాలు దేశంలో ఉన్నాయా..? కాంగ్రెస్ నేతలకు పాలన చేతకాక పిచ్చిమాటలు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
- Minister Konda Surekha | కొమురవెల్లి మల్లన్న జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలి : మంత్రి కొండ సురేఖ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

