Chateshwar Pujara | రంజీ ట్రోఫీకి సన్నద్ధమవుతున్న నయావాల్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియో వైరల్
Chateshwar Pujara : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్లో దారుణ వైఫల్యంతో భారత జట్టులో చోటు కోల్పోయిన ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara) రంజీ సమరానికి సిద్ధమవుతున్నాడు. రాజ్‌కోట్(Rajkot)కు ప్రాతినిధ్యం వహిస్తున్న నయా వాల్ నెట్స్‌లో...
Chateshwar Pujara : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్లో దారుణ వైఫల్యంతో భారత జట్టులో చోటు కోల్పోయిన ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara) రంజీ సమరానికి సిద్ధమవుతున్నాడు. రాజ్‌కోట్(Rajkot)కు ప్రాతినిధ్యం వహిస్తున్న నయా వాల్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఓటమి అనంతరం పూజారా ఈ వీడియో పెట్టడం చర్చనీయాంశమైంది. మిడిలార్డర్లో గోడలా నిలబడే తన అవసరం ఉందంటూ ఈ రాజ్‌కోట్ బ్యాటర్ చెప్పకనే చెప్తున్నాడా అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పుజారా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 5న రంజీ సీజన్ మొదలవ్వనుంది. గ్రూప్ ఏలో ఉన్న రాజ్‌కోట్ జట్టు తొలి పోరులో జార్ఖండ్‌ను ఢీ కొట్టనుంది.
Ranji Trophy prep mode: 🔛 pic.twitter.com/kFN3PyvTHx
— Cheteshwar Pujara (@cheteshwar1) December 30, 2023
రంజీల్లో సాధికారిక ఇన్నింగ్స్‌లతో భారత జట్టులోకి వచ్చిన పూజారా అనతికాలంలోనే ద్రవిడ్(Rahul Dravid) వారసుడు అనిపించుకున్నాడు. సొంతగడ్డపై, విదేశాల్లో ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు కూడా. ముఖ్యంగా 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా ఆ తర్వాత వరుస విజయాలతో టెస్టు సిరీస్ గెలవడంలో పుజారా పాత్ర

ఎంతో ఉంది. రిషభ్ పంత్(Rishabh Pant)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చడాన్ని అభిమానులు మర్చిపోలేరు. అయితే.. 2022-23లో పుజారా తేలిపోయాడు. ముఖ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో 14, 27 పరుగులతో కోచ్, కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేశాడు. దాంతో, సెలెక్టర్లు ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ సిరీస్‌కు అతడిని పక్కన పెట్టేశారు. దాంతో, రంజీల్లో రాణించి మళ్లీ జట్టులోకి వచ్చేందుకు పుజారా ప్రయత్నిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
- CM Revanth Reddy | మెగా డీఎస్సీతో టీచర్ల భర్తీకి చర్యలు : సీఎం రేవంత్
- Andy Murray | ఇప్పటికీ టెన్నిస్‌ను ప్రేమిస్తున్నా.. వీడ్కోలు వార్తల్ని కొట్టిపారేసిన ముర్రే
- NRI News | ఆన్లైన్ వేదికగా పింగళి జయంతికి పరిపూర్ణ నివాళి..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

