NRI News | ఆన్లైన్ వేదికగా పింగళి జయంతికి పరిపూర్ణ నివాళి..!
NRI News | ప్రఖ్యాత సినీ రచయిత పింగళి నాగేంద్ర రావు 122వ జయంతి సందర్భంగా ఆయనకు శుక్రవారం ఆన్ లైన్ వేదికగా శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
NRI News | శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అలనాటి మాటల మాంత్రికుడు, ప్రఖ్యాత సినీ రచయిత పింగళి నాగేంద్ర రావు 122వ జయంతి సందర్భంగా, శుక్రవారం ఆన్లైన్లో `పింగళి మాటా పాటా` కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించారు. మాయాబజార్, పాతాళభైరవి, మిస్సమ్మ, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, అప్పుచేసి పప్పుకూడు, గుణసుందరి కథ, పెళ్లి చేసి చూడు తదితర తెలుగు సినిమాలకు పాటలు, మాటలు అందించిన పింగళి గారి రచనా వైశిష్యం, సామర్థ్యం ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ప్రముఖ సినీ గేయకవి భువనచంద్ర, ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసూరావు మాట్లాడుతూ పింగళి జీవిత విశేషాలు, సినీ ప్రస్థానం గురించి పలు విశేషాలను పంచుకున్నారు. పింగళి రాసిన పలు పాటలను ప్రముఖ గాయకులు తాతా బాలకామేశ్వరరావు, చింతలపాటి సురేష్, వైఎస్ రామకృష్ణ, శాంతిశ్రీ, డా. స్రవంతి, భవ్య తుములూరు ఆలపించి ఆహుతులను అలరించారు.
రాధిక మంగిపూడి సభ నిర్వహణలో అమెరికా నుండి ప్రముఖ గాయని శారదా ఆకునూరి, ఖతార్ నుండి వెంకప్ప భాగవతుల, సాహిత్య జ్యోత్స్న, మలేషియా నుండి సత్య దేవి మల్లుల తదితరులు మాట్లాడారు.
కల్చర్ టీవీ సాంకేతిక నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పలువురు అభిమానులు అభినందించారు.
పూర్తి కార్యక్రమాన్ని వీక్షించడానికి లింక్:
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

