Andy Murray | ఇప్పటికీ టెన్నిస్‌ను ప్రేమిస్తున్నా.. వీడ్కోలు వార్తల్ని కొట్టిపారేసిన ముర్రే
Andy Murray : బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే(Andy Murray ) రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు. తాను ఇప్పటికీ టెన్నిస్‌ను ప్రేమిస్తున్నానని, వీడ్కోలు పలికే ఆలోచనే తనకు లేదని ముర్రే స్పష్టం చేశాడు. 'నాకు వయసు పైబడొచ్చు. కానీ టెన్నిస్ ఆటంటే నాకు...
Andy Murray : బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే(Andy Murray ) రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు. తాను ఇప్పటికీ టెన్నిస్‌ను ప్రేమిస్తున్నానని, వీడ్కోలు పలికే ఆలోచనే తనకు లేదని ముర్రే స్పష్టం చేశాడు. ‘నాకు వయసు పైబడొచ్చు. కానీ టెన్నిస్ ఆటంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. కోర్టులో ప్రాక్టీస్ చేయడం, టోర్నమెంట్ల కోసం ప్రయాణాలు చేయడాన్ని మునపటిలానే ఆస్వాదిస్తున్నా. నా వల్ల ఇక కాదు అనేంత వరకు నేను రాకెట్‌ను వదలను’ అని ముర్రే వెల్లడించాడు. మాజీ వరల్డ్ నంబర్ 1 అయిన ముర్రే వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్నాడు.
టోర్నీకి 14 రోజులే ఉండడంతో సన్నాహకాల్లో భాగంగా శనివారం ముర్రే.. 22 గ్రాండ్‌స్లామ్ విజేత రఫెల్ నాదల్(Rafeal Nadal)తో తలపడ్డాడు. దాంతో మ్యాచ్ అనంతరం స్పెయిన్ బుల్‌కు ధన్యవాదాలు చెప్తూ బ్రిటన్ లెజెండ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ‘నీతో కలిసి ఆడే అవకాశం లభించనందుకు ధన్యవాదాలు. రీ ఎంట్రీలో నువ్వు అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నా’ అని ముర్రే పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Thanks for the opportunity to be back on the court with you..Good luck with the comeback 💪 https://t.co/ZzmvTMhHUD
— Andy Murray (@andy_murray) December 30, 2023
ఇప్పటివరకూ మూడు గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లు సాధించిన ఈ దిగ్గజ ప్లేయర్ కెరీర్ చివర్లో మరో గ్రాండ్‌స్లామ్ కొల్లగొట్టాలనే కసితో ఉన్నాడు. 2005లో అరంగేట్రం చేసిన ముర్రే 46 సింగిల్స్ టైటిళ్లు, 14 మాస్టర్స్ 1000 టైటిళ్లతో పాటు ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలు గెలిచాడు. తొడ కండరాల గాయం కారణంగా ఏడాది కాలంగా ఆటకు దూరమైన నాదల్ ఈ టోర్నీతో పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మహిళల సింగిల్స్‌లో నవామి ఒసాకా కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో మళ్లీ ఎంట్రీ ఇస్తోంది.
ఇవి కూడా చదవండి
- South Afirca Cricketer | ఒక్క మ్యాచ్ ఆడకున్నా టెస్టు కెప్టెన్సీ.. లక్కీ చాన్స్‌కు కారణమదేనా..?
- Tenth Exams | తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
- ITR filings | 2022-23 ఐటీ రిటర్న్స్‌లో సరికొత్త రికార్డు.. అదేమిటంటే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

