దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee).. హెలికాప్టర్ సీటులో కూర్చోబోయి కిందపడ్డారు. ఈ ఘటన పశ్చిమ్ బర్దమాన్ జిల్లాలోని దుర్గాపూర్ వద్ద జరిగింది. హెలికాప్టర్లోకి ప్రవేశించిన తర్వాత సీటులో కూర్చోబోయే క్షణంలో మమతా బెనర్జీ తుళ్లిపడ్డారు. ఆమెకు స్వల్పస్థాయిలో గాయాలు అయ్యాయి. సెక్యూర్టీ సిబ్బంది ఆమెను వెంటనే పైకి లేపారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు ఆమె అసన్సోల్ బయలుదేరి వెళ్లారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee slipped and fell while taking a seat after boarding her helicopter in Durgapur, Paschim Bardhaman today. She reportedly suffered a minor injury and was helped by her security personnel. She continued with her onward travel to Asansol. pic.twitter.com/UCt3dBmpTQ
— ANI (@ANI) April 27, 2024