హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల (Tenth exams )షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీవరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ డైరెక్టర్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.
18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 23న మ్యాథ్స్, 26న సైన్స్ మొదటి పేపర్, 28న సైన్స్ రెండవ పేపర్, 30న సోషల్ స్టడీస్, 1వ తేదీన ఒకేషనల్ కోర్సువారికి సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్, 2న రెండవ పేపర్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
SSC EXAMS SHEDULE