IND vs BAN 1st Test : టీ20 వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో తొలి సిరీస్‌లో భారత జట్టు(Team India) మొదట్లో తడబడినా ఆఖరికి నిలబడింది. పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ విజయోత్సాహాన్ని కొనసాగించిన బంగ్లా భారత్‌ను ఆదిలో ఇరుకున పెట్టింది. పేసర్ హసన్ హహమూద్ (4/58) ధాటికి టాపార్డర్ విఫలమైనా యశస్వీ జైస్వాల్(56) మెరుపులతో కోలుకుంది. ఇక మిడిలార్డర్లో రవిచంద్రన్ అశ్విన్(102 నాటౌట్), రవీంద్ర జడేజా(85నాటౌట్)ల ఎదురు దాడితో బంగ్లాదేశ్ కుదేలైంది. రెండో సెషన్ నుంచి మొదలైన టీమిండియా ఆధిపత్యం ఆఖరి సెషన్లో తారా స్థాయికి చేరింది.
అశ్విన్, జడేజాలు దూకుడే మంత్రగా చెలరేగడంతో బంగ్లా బౌలర్లు, ఫీల్డర్లు బిక్కమొహాలు వేశారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యంతో రోహిత్ సేన పటిష్ఠ స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా స్కోర్.. 339/6. రెండో రోజు కూడా వీళ్లు ఇదే తరహాలో ఆడితే బంగ్లాకు కష్టకాలమే.
A Heroic HUNDRED in 📸📸 @ashwinravi99, that was special 👌👌
Scorecard – https://t.co/jV4wK7BgV2#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/J70CPRHcH5
— BCCI (@BCCI) September 19, 2024
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ పేస్‌కు అనూకలించడం బంగ్లా పేసర్లకు వరమైంది. హసన్ హహమూద్(4/58) సూపర్ బౌలింగ్‌తో తొలి సెషన్లోనే మూడు కీలక వికెట్లు తీసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాడు.
It’s him again!
Rishabh Pant wafts at one outside off and edges to the keeper; Hasan Mahmud gets his fourthhttps://t.co/hBUP43SLab #INDvBAN pic.twitter.com/JpXOeIU5nC
— ESPNcricinfo (@ESPNcricinfo) September 19, 2024
అతడి విజృంభణకు రోహిత్ శర్మ(6), శుభ్‌మన్ గిల్(0), విరాట్ కోహ్లీ(6)లు క్రీజులో నిలవలేకపోయారు. ఆ దశలో యశస్వీ జైస్వాల్(56), రిషభ్ పంత్(39) సమయోచితంగా ఆడి స్టోర్ బోర్డును ముందుకు నడిపారు. లంచ్ తర్వాత పంత్ త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(16) జతగా ఇన్నింగ్స్ నిర్మించిన యశస్వీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు.
ప్రమాదకరంగా మారుతున్న యశస్వీని నిషద్ రానా వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే రాహుల్ అతడిని అనుసరించాడు. అప్పటికీ 144 పరుగులకే ఆరు వికెట్లు పడ్డాయి. అంతే.. టీమిండియా స్కోర్ 200 అయినా దాటుతుందా? లేదా? అని స్టేడియంలో కూర్చున్న, టీవీల ముందున్న అభిమానుల్లో చిన్న సందేహం. కానీ, ఒత్తిడిలో పలుమార్లు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన అశ్విన్(102 నాటౌట్), జడేజా(85 నాటౌట్)లు క్రీజులో పాతుకుపోయారు.
A stellar TON when the going got tough!
A round of applause for Chennai’s very own – @ashwinravi99 👏👏
LIVE – https://t.co/jV4wK7BgV2 #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/j2HcyA6HAu
— BCCI (@BCCI) September 19, 2024
బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ పరుగుల సాధించారు. అలాగని జిడ్డు ఆట ఆడలేదు. బౌండరీలతో బంగ్లాదేశ్ బౌలర్ల లయను దెబ్బతీసి టీమిండియాను ఆదుకున్నారు. తనకెంతో ఇష్టమైన చెపాక్ స్టేడియంలో అశ్విన్ తన మార్క్ ఆటతో రెచ్చిపోయాడు. టాపార్డర్ విఫలైమన చోట సాధికారిక ఇన్నింగ్స్‌తో వారెవ్వా అనిపించాడు. బంగ్లా బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ అశ్విన్ కేవలం 108 బంతుల్లోనే శతకగర్జన చేశాడు.