Moto G85 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ85 5జీ ఫోన్ను గత జూలైలో మూడు రంగుల్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా మెజెంటా రంగులో మార్కెట్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. మెజెంటాతోపాటు గ్రీన్ కలర్ ఆప్షన్ లోనూ ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం. త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా మోటో జీ85 5జీ వివా మెజెంటా కలర్ వేరియంట్ ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతుంది.
ప్రస్తుతం కోబాల్ట్ బ్లూ, ఆలీవ్ గ్రీన్, అర్బన్ గ్రే రంగుల్లో మోటో జీ85 5జీ ఫోన్ లభిస్తుంది. తాజాగా వివా మెజెంటాతోపాటు గ్రీన్ కలర్ ఆప్షన్ లోనూ లభిస్తుందని తెలుస్తోంది. డార్కర్ గ్రీన్ కలర్ ఆప్షన్ లోనూ వస్తుందని సమాచారం. ఒకవేళ రెండు కలర్ వేరియంట్లు వస్తే వెగాన్ లెదర్ ఫినిష్ తో వస్తాయని చెబుతున్నారు.
మోటో జీ85 5జీ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోపాటు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ పోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. క్వా్ల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తోంది. 33వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 32-మెగా పిక్సెల్ సెన్సర్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. మోటో జీ85 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999లకు లభిస్తున్నాయి. తాజాగా ఆవిష్కరించే వివా మెజెంటా కలర్ ఆప్షన్ ఫోన్ కూడా ఇదే ధరకు లభిస్తుందని భావిస్తున్నారు.