ఆపరేషన్ క్రాక్‌డౌన్.. సైబర్ మోసాల నెట్వర్క్ గుట్టు రట్టు
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు సహకరిస్తూ, అద్దె ఖాతాలను నిర్వహిస్తున్న నెట్వర్క్ గుట్టును ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ పేరిట తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. గత నెల 25న ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను గుర్తించినట్టు తెలిపారు.
- 1,888 మ్యూల్ ఖాతాలు గుర్తింపు
- రాష్ట్ర వ్యాప్తంగా 549 ఎఫ్ఐఆర్లు
- టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడి
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు సహకరిస్తూ, అద్దె ఖాతాలను నిర్వహిస్తున్న నెట్వర్క్ గుట్టును ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ పేరిట తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. గత నెల 25న ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను గుర్తించినట్టు తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నుంచి సేకరించిన డాటాను విశ్లేషించి ప్రక్రియ చేపట్టినట్టు వివరించారు. మొత్తం 517 మంది సిబ్బందితో 137 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 137 బ్యాంకు శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు.
అరెస్టయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు
ఈ తనిఖీల్లో దేశవ్యాప్తంగా సుమారు 9,541 నేరాలను గుర్తించినట్టు శిఖాగోయల్ తెలిపారు. దాదాపు రూ.100 కోట్ల నష్టానికి కారణమైన 1,888 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ధ్రువీకరించినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 549 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 626 మంది అనుమానితులను గుర్తించగా వారిలో 208 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారిలో 15 మంది మహిళలు, ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, విద్యుత్తుశాఖలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా ఉన్నట్టు వెల్లడించారు. వీరంతా తమ బ్యాంకు ఖాతాలను సైబర్ మోసగాళ్లకు అద్దెకు ఇచ్చి, ప్రతి లావాదేవీపై 5శాతం వరకు కమీషన్ తీసుకున్నట్టు విచారణలో తేలినట్టు వివరించారు.
ఖాతాలను అద్దెకు ఇస్తే కఠిన చర్యలు
వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు 112 బీఎన్‌ఎస్‌ను ఈ కేసుల్లో ప్రయోగించామని వెల్లడించారు. ఖాతాలు తెరువడానికి సహకరించే వారిని గుర్తించి వారిపై నిఘా పెంచినట్టు పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ తమ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. కమీషన్ల కోసం ఖాతాలను అద్దెకు ఇవ్వడం నేరమని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

