మట్టి-రాయి అందానికి ఏది మంచిది?
ముల్తానీ మట్టి.. కొన్ని శతాబ్దాలుగా ముఖారవింద సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. ఆధునిక చర్మ సంరక్షణ ఉత్పత్తులు రావడానికి చాలాకాలం ముందే.. భారతీయ మహిళల బ్యూటీ ప్రొడక్ట్‌గా మారింది.
ముల్తానీ మట్టి.. కొన్ని శతాబ్దాలుగా ముఖారవింద సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. ఆధునిక చర్మ సంరక్షణ ఉత్పత్తులు రావడానికి చాలాకాలం ముందే.. భారతీయ మహిళల బ్యూటీ ప్రొడక్ట్‌గా మారింది. అనేక ఖనిజాలతో కూడిన ఈ బంకమట్టి.. సహజ క్లెన్సర్‌గా, గ్లో బూస్టింగ్ ఫేస్ ప్యాక్‌గా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, ముల్తానీ మట్టి.. రాయి, పొడి రెండు రూపాల్లో లభ్యమవుతుంది. మరి ఈ వేసవిలో మెరిసే చర్మం కోసం దేనిని ఉపయోగిస్తే మంచిదో చూద్దాం!
ముల్తానీ మట్టి స్టోన్
గడ్డలుగా, రాయి రూపంలో ఉండే ముల్తానీ మట్టి.. పూర్తిగా సహజసిద్ధమైంది. అత్యంత స్వచ్ఛమైనది. అప్పటికీ ఎలాంటి ప్రాసెసింగ్‌కు గురవ్వదు కాబట్టి.. ఇందులోని సహజమైన ఖనిజాలు అలాగే ఉంటాయి. కల్తీ ఉండే అవకాశం చాలా తక్కువ. సౌందర్య సంరక్షణ కోసం కావాల్సినంత సమయం ఉండి, ఎటువంటి రసాయనాలు, కల్తీలేని స్వచ్ఛమైన ఉత్పత్తుల్నే వాడుకోవాలని అనుకునేవారికి ముల్తానీ మట్టి రాయి మంచి ఆప్షన్. కాకుంటే, ముల్తానీ మట్టి గడ్డలు బహిరంగ మార్కెట్లలో దొరకడం కొంచెం కష్టం. వాడటానికి కూడా కాస్త ముందస్తు కసరత్తు చేయాలి. ఒక చిన్న ముల్తానీ మట్టి గడ్డను తీసుకుని రాత్రంతా నీటిలో గానీ, రోజ్ వాటర్‌లో గానీ నానబెట్టాలి. ఉదయానికి మెత్తని పేస్ట్‌గా మారి, వాడుకోవడానికి అనుకూలంగా సిద్ధమవుతుంది.
ముల్తానీ మట్టి పొడి
పొడి రూపంలో దొరికే ముల్తానీ మట్టిని తక్షణమే వాడుకోవచ్చు. బిజీగా ఉండే వారికి, మొదటిసారి ఉపయోగించేవారికి అనుకూలంగా ఉంటుంది. బ్యూటీ స్టోర్లు, ఆన్లైన్ మార్కెట్లో సులభంగానే దొరుకుతుంది. దీనిని వాడటం చాలా ఈజీ. పాలు, కలబంద, పెరుగు, రోజ్ వాటర్.. ఇలా దేనితోనైనా సులభంగా కలపవచ్చు. అయితే, దీని నాణ్యత విషయం కొంచెం ప్రశ్నార్థకమే! ప్రాసెసింగ్ సమయంలో కొన్ని ఖనిజాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. కొన్ని బ్రాండ్లలో మెరుపు కోసం, సువాసన కోసం ఇతర పొడులు, రసాయనాలు కలుపుతుంటారు. కాబట్టి కొనేటప్పుడు 100% ఆర్గానిక్ అని నిర్ధారించుకోవాలి.
మరి ఏది మంచిది?
ఫలితాల పరంగా చూస్తే.. ముల్తానీ మట్టి రాయి కొంచెం మెరుగ్గా పనిచేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది కల్తీ లేని అసలైన మట్టి. మండే ఎండల్లో సౌందర్య పోషణకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. జిడ్డు చర్మం ఉన్నట్లయితే.. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్‌తో కలిపి వాడుకోవాలి. పొడి చర్మం ఉన్నవారైతే.. పాలు/ పెరుగుతో కలిపి ఉపయోగించుకోవచ్చు. మరో ముఖ్యవిషయం.. ముల్తానీ మట్టిని వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే, ఇది చర్మంలోని సహజ నూనెలను పూర్తిగా తొలగిస్తుంది. దాంతో, వేసవిలో చర్మం మరింత పొడిబారుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

