Sreeleela | టాలీవుడ్లో బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది శ్రీలీల (Sreeleela). చివరగా మహేశ్ బాబు నటించిన గుంటూరు కారంలో మెరిసిన ఈ భామ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. ప్రొఫెషనల్‌గా తీరిక లేకుండా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేసేందుకు టైం కేటాయిస్తుంటుంది శ్రీలీల. ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్-ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నది.
ఈ సెషన్లో ఓ అభిమాని ఈ భామను ఆసక్తికర ప్రశ్న వేశాడు. కెరీర్లో ఇప్పటివరకు మీరు పోషించిన పాత్రల్లో మీకు ఎక్కువ ఇష్టమైన పాత్ర ఏది.. అని అడిగాడు. దీనికి శ్రీలీల స్పందిస్తూ సినిమా పేరు చెప్పకుండా.. ముఖంపై గాయమైన ఓ సినిమాలోని స్టిల్‌ను షేర్ చేస్తూ.. ఊహించండి అని సమాధానమిచ్చింది. ఇంకేంటి మరి ఫొటో రూపంలో హింట్ ఇచ్చేయడంతో.. ఈ స్టిల్ భగవంత్ కేసరి సినిమాలోనిదంటూ అప్పుడే క్లారిటీకి వచ్చేశారు మూవీ లవర్స్.
భగవంత్ కేసరిలో శ్రీలీల పోషించిన విజ్జి పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే సైమా అవార్డ్స్ 2024లో ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం కూడా అందుకుంది భగవంత్ కేసరి. శ్రీలీల ప్రస్తుతం నితిన్‌తో కలిసి రాబిన్ హుడ్, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు RT75 ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Sreeleela 1
Vettaiyan | రజినీకాంత్ స్టైల్ అదుర్స్.. వెట్టైయాన్ ఆడియో, Prevue లాంచ్ టైం ఫైనల్
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?
RC 16 | టాలీవుడ్లో తొలిసారి.. రాంచరణ్ ఆర్సీ 16 టీంలోకి తంగలాన్ ఆర్టిస్ట్