Raashii Khanna | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. రాశీఖన్నా కీ రోల్ పోషిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా రాశీఖన్నా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
పవన్ కల్యాణ్ సినిమా అని తెలియగానే చాలా ఎక్జయిట్‌మెంట్‌తో కథ వినకముందే సినిమాకు ఒకే చెప్పానంది రాశీఖన్నా. నా తొలి సినిమా నుంచి పవన్ కల్యాణ్ స్టార్డమ్ గురించి, పవనిజం గురించి చాలా వింటున్నా. అప్పటి నుంచి ఆయనతో ఒక్కసారైనా నటించాలని అనుకునేదాన్ని. ఉస్తాద్ భగత్ సింగ్‌తో నా కల నెరవేరింది. ఇందులో నేను శ్లోక అనే మోడ్రన్ యువతి పాత్రలో కనిపిస్తా. నాతోపాటు ప్రతీ పాత్ర కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఇందులో నేను మాస్ సాంగ్‌లో కనిపిస్తా. ఆ పాటకు డ్యాన్స్ చేయడాన్ని, షూటింగ్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశానంటూ చెప్పుకొచ్చింది. పవన్ కల్యాణ్ సాదాసీదాగా ఉండే వ్యక్తి. ఎప్పుడూ బుక్స్ చదువుతుంటారు. ఆయన తొలి రోజు షూటింగ్లో మీరు నటి అవ్వాలనుకున్నారా..? అని నన్ను అడిగారు. నిజానికి తాను ఐఏఎస్ ఆఫీసర్ అవుదామనుకున్నానని ఆయనతో చెప్పాను. పవన్ కల్యాణ్ తక్కువగా మాట్లాడుతారు.. కానీ ఆయన ప్రతీ మాటకు ఒక విలువ ఉంటుంది. ఆయన ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తుంటారంది రాశీఖన్నా.
హరీష్ శంకర్‌కు మాస్ ఆడియెన్స్ పల్స్ చాలా బాగా తెలుసు. నిద్ర లేకుండా అవిశ్రాంతంగా సినిమా కోసం పనిచేశారు. 120 రోజుల్లో చేయాల్సిన షూటింగ్‌ను 40 రోజుల్లోనే పూర్తి చేశారు. సెట్స్‌లో తరచూ పంచ్ డైలాగ్స్ రాసేవారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పింది రాశీఖన్నా. ఇప్పుడీ కామెంట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఈ మూవీలో పార్థీబన్ విలన్‌గా నటిస్తుండగా.. గౌతమి, కేఎస్ రవికుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ఎస్ థమన్ చేస్తున్నాడు.