Maatrubhumi | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan). అపూర్వ లాఖియా దర్శకత్వంలో భారతదేశం-చైనా సరిహద్దులో 2020లో జరిగిన గల్వాన్ లోయ సంఘటన ఆధారంగా వార్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రంలో బాలీవుడ్ భామ చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్ ఊహించని నిర్ణయంతో వార్తల్లో నిలిచింది.
ఈ మూవీ టైటిల్‌ను బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ నుంచి ‘మాతృభూమి’గా మార్చారు. కొత్త టైటిల్‌తో డిజైన్ చేసిన పోస్టర్‌ను కూడా ఆన్లైన్లో విడుదల చేశారు మేకర్స్. అయితే అనూహ్యంగా చేసిన టైటిల్ మార్పు ఇంతకీ కారణమే ఉంటుందా..? అని అభిమానులు, మూవీ లవర్స్‌లో క్యూరియాటీ పెంచుతోంది. ఈ మూవీ టీజర్ విడుదలైన తర్వాత ఈ చిత్రంలో గాల్వన్ యుద్ధానికి సంబంధించి వాస్తవాలను వక్రీకరిస్తున్నారంటూ చైనీస్ స్టేట్ రన్ చేస్తున్న మీడియా కొత్త వివాదానికి తెరలేపింది. అయితే దీనిని భారత ప్రభుత్వ నిషేధంగా కంటే కూడా బాహ్యంగా రాజకీయ ఎదురుదెబ్బగా భారత నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలో తాజాగా సల్మాన్ ఖాన్ అండ్ టీం తీసుకున్న టైటిల్ మార్పుతో ఇక వివాదానికి ముగింపు పడ్డట్టేనని.. ఒరిజినల్ టైటిల్‌పై వచ్చిన అభ్యంతరాల ఫలితంగా మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని కొత్త పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తెలంగాణకు చెందిన వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. కాగా దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కాంబోలో వస్తోన్న తొలి సినిమా ఇది.
May War Rest In Peace #Maatrubhumi@LakhiaApoorva @IChitrangda #HimeshReshammiya #CchintanShah @SKFilmsOfficial @SKF_Music @ShamiraahN pic.twitter.com/8eE4VgNhAK
— Salman Khan (@BeingSalmanKhan) March 16, 2026
Chinmayi | వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ విష్ చేయడంతో సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు
Akshay Kumar | తండ్రిని కోల్పోయిన బాధని గుర్తుచేసుకున్న అక్షయ్ కుమార్.. పురుషులకు కీలక సూచన