IND BAN 1st Test : భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(101) టెస్టుల్లో మరోసారి వంద కొట్టేశాడు. అది కూడా సొంత మైదానంలో.. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన అశ్విన్ టెస్టుల్లో ఆరో శతకం బాదేశాడు. షకీబుల్ హసన్ బౌలింగ్‌లో డబుల్స్, సింగిల్ తీసి అతడు వంద పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న రవీంద్రే జడేజా(83) సైతం సెంచరీకి చేరువయ్యాడు.
చెపాక్ స్టేడియంలో అశ్విన్ తన మార్క్ ఆటతో రెచ్చిపోయాడు. టాపార్డర్ విఫలైమన చోట సాధికారిక ఇన్నింగ్స్‌తో వారెవ్వా అనిపించాడు. బంగ్లా బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ అశ్విన్ కేవలం 108 బంతుల్లోనే శతకగర్జన చేశాడు. ఒకదశలో 144 వద్ద 6 వికెట్లు కోల్పోయిన జట్టును అశ్విన్ తన సెంచరీతో ఆదుకున్నాడు. రవీంద్ర జడేజా(83)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో, భారత్ ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.