అరచేతిలో స్మార్ట్‌వాచ్ అద్భుతాలు.. మరోవైపు మణికట్టుపై స్మార్ట్‌వాచ్ మాయాజాలం.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్! జేబులో నుంచి ఫోన్ తీయకుండానే.. వాచ్ తెరే అన్నీ చెప్పేస్తున్నది. ఫిట్నెస్ ముచ్చట్లయితే అదనం. ఫోన్‌ని చార్జ్ చేసినట్టుగా వీటిని రోజూ చార్జ్ చేయాల్సిన పని లేదు. కావాలంటే.. రెడ్మీ కొత్తగా మార్కెట్లోకి తెస్తున్న ఈ ‘వాచ్ 5’ ని చూడండి. దీంట్లో అదిరే ముచ్చటేందంటే.. 18 రోజుల బ్యాటరీ లైఫ్. ‘క్లియర్ ప్లస్’ కాలింగ్ ఫీచర్‌తో రద్దీ ప్రాంతాల్లోనూ హాయిగా ఫోన్ మాట్లాడొచ్చు. ‘నోయిస్ క్యాన్సిలేషన్’తో వాయిస్ క్వాలిటీ అదిరిపోతుంది. రెండు అంగుళాల టచ్ స్క్రీన్. ‘షామీ హైపర్ ఓఎస్’తో వాచ్ పని చేస్తుంది. అలెక్సా వాయిస్ సపోర్ట్ ఉంది. వాయిస్ కమాండ్స్తోనూ వాచ్ స్పందిస్తుంది. ఫిట్నెస్ ట్రాకర్‌గా మీ ఆరోగ్యంపై నిత్యం ఓ కన్నేస్తుంది.
దొరుకు చోటు : https://rb.gy/ smjajd
చెవులకు ట్రెండీగా..
ఇయర్ ఫోన్స్ కొనాలంటే? అబ్బో.. చాలా ఛాయిస్‌లు మదిలోకి వచ్చేస్తాయ్. నెక్ బ్యాండ్స్ బెటరా? హెడ్‌ఫోన్ అయితే ఎలా ఉంటుంది!? ఇయర్ బడ్స్ ఇంకా మంచి చాయిస్ ఏమో?.. అంటూ చకచకా మదిలో పలు మోడల్స్ ఫ్లాష్ అవుతాయ్. కానీ, ‘పెబిల్’ కంపెనీ అందించే ఇయర్ ఫోన్స్ ఎప్పుడైనా చూశారా? మార్కెట్లోకి కొత్తగా Pebble Glory బడ్స్ వచ్చాయ్. డైమ్ండ్ కట్ డిజైన్‌తో వీటిని తయారు చేశారు. క్షణాల్లో ఫోన్‌తో జట్టు కట్టేస్తాయి. దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే.. AI Environmental Noise Cancellation. ఎలాంటి రద్దీ ప్రదేశాల్లోనైనా కాల్ క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా బయటి శబ్దాల్ని ఫిల్టర్ చేస్తుంది. మ్యూజిక్ ఆల్బమ్స్‌ని ఫుల్ బాస్ (Deep Bass)తో వినొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటలు పని చేస్తాయి. చెమట, వర్షంలో తడిచినా ఏం కంగారు పడక్కర్లేదు. టైప్-సీ పోర్ట్‌తో ఛార్జ్ చేయొచ్చు. 10 నిమిషాలు చార్జ్ చేసి 150 నిమిషాలు పాటలు వినొచ్చు.
ధర : రూ.1,499
దొరుకు చోటు : https://rb.gy/n3yhc0
స్టాండే కాదు.. స్పీకర్ కూడా!
ఆఫీసైనా.. వర్క్ ఫ్రమ్ హోం అయినా.. ఎక్కడున్నా.. అయితే ల్యాప్‌టాప్.. లేదంటే ఫోన్! ఈ రెండూ జోడెద్దుల్లా వర్క్డెస్క్లపై ఉండాల్సిందే! అలాంటప్పుడు ల్యాప్‌టాప్ పక్కనే స్మార్ట్‌ఫోన్ ఠీవిగా నిలబడి.. వర్క్‌లో మీతో కలిసి సింక్ అయితే! అందుకే ఈ స్టాండ్! ఇది కేవలం స్టాండ్ మాత్రమే కాదండోయ్.. స్పీకర్ కూడానూ. బ్లూటూత్‌తో ఫోన్ లేదా ల్యాపీకి కనెక్ట్ అవుతుంది. ఆఫీస్ వీడియో కాన్ఫెరెన్స్ మాట్లాడే సమయంలో దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఫోన్ స్టాండ్ 360 డిగ్రీల్లో ఎటైనా తిప్పుకొని చూడొచ్చు. యాంటి స్లిప్ సిలికాన్ మెటీరియల్‌తో ఫోన్‌ను సుతారంగా పట్టుకుటుంది. దీంతో మీ ఫోన్‌పై ఎలాంటి గీతలు పడవు. బ్యాటరీ సామర్థ్యం 1500ఎంఏహెచ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 నుంచి 4 గంటలు పని చేస్తుంది.
ధర : రూ.1150
దొరుకు చోటు : https://rb.gy/6tsmhh
5జీ కోసం క్రేజీ ఫోన్
అన్నీ ఉండాలి కానీ.. బడ్జెట్ లో వచ్చేయాలి! అని లెక్కలేసే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వివో హాట్‌హాట్ మోడల్ని మార్కెట్లోకి తెచ్చింది. మోడల్ ‘వివో టీ3 ప్రో 5జీ’. బడ్జెట్లో 5జీ ఫోన్‌కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇదో చక్కని చాయిస్. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌ని దీంట్లో వాడారు. ర్యామ్ 12 జీబీ. ఫోన్ తెర పరిమాణం 6.77 అంగుళాలు. 3డీ curved AMOLED స్క్రీన్. వెనక రెండు ప్రైమరీ కెమెరాలు. ఒక్కోదాని సామర్థ్యం 50 మెగాపిక్సల్. Sony IMX882 ప్రైమరీ సెన్సర్ ఉంది. అలాగే, 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఇక ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంది. ఫోన్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. డిస్ ప్లేలోనే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ని ఏర్పాటు చేశారు. ఇంటర్నల్ మెమొరీ 128జీబీ. బ్యాటరీ సామర్థ్యం 5,500ఎంఏహెచ్.
ధర : రూ.24,999
దొరుకు చోటు : https://rb.gy/7f9t9a