Viral Video : ఘన సాంస్కృతిక వారసత్వం కలిగిన అమృత్సర్ నగరం తన విలక్షణ వంటకాలతోనూ విశ్వవ్యాప్తంగా ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. మక్కీ రోటీతో సర్సన్ దా సాగ్ అయినా, ఛోలే భటూరే, దాల్ మఖానీ వంటి క్లాసిక్స్‌తో అయినా అమృత్సర్ టేస్ట్ క్యాపిటల్ అంటూ భోజన ప్రియులు కితాబిస్తున్నారు. ఇక తన ఐకానిక్ డిష్‌ల్లో అమృత్సరి కుల్చా కూడా ఎందరికో ఫేవరెట్ డిష్‌గా మారిపోయింది.
పొటాటో, పనీర్, వెజిటబుల్ మిక్స్ స్టఫ్ చేసి నోరూరించే ఈ కుల్చాను అందరూ లొట్టలేస్తూ ఆరగిస్తారు. భారత్‌లో ఈ డిష్ భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఫేమస్ అయింది. ఇక చైనాలో ఓ వైరల్ వీడియోలోనూ అమృత్సర్ కుల్చా సందడి చేసింది. ఇన్‌స్టాగ్రాంలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో చైనాకు చెందిన ఓ వీధి వ్యాపారి షెంజెన్‌లో ఈ డిష్‌ను ప్రిపేర్ చేసి కస్టమర్లకు సర్వ్ చేయడం కనిపిస్తుంది.
షెంజెన్, చైనాలో అమృత్సర్ కుల్చాను చూశామని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక చైనాలో అమృత్సర్ కుల్చాను చూడటం బావుందని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఆసమ్ పర్ఫెక్ట్ అమృత్సర్ కుల్చా అని మరో యూజర్ రాసుకొచ్చారు. చైనా ఫుడ్స్‌ను ఇండియన్స్, ఇండియన్ ఫుడ్స్‌ను చైనీస్ తయారుచేయడం బావుందని మరో యూజర్ కామెంట్ చేశారు. చైనాలో పంజాబ్ అని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :
Mahesh Babu | ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీ.. మరో బిజినెస్‌లోకి మహేశ్ బాబు.. !