Mahesh Babu | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్లలో ఒకడు మహేశ్ బాబు (Mahesh Babu). ఈ స్టార్ యాక్టర్ ఓ వైపు సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూనే.. మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు ఖాతాలో క్లాతింగ్ బ్రాండ్, మల్టీప్లెక్స్ బిజినెస్, రెస్టారెంట్ ఉన్నాయి. తాజాగా మహేశ్‌బాబు మరో వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటనే కదా మీ డౌటు.. వెల్నెస్ బ్రాండ్ ఫిట్ డే (Fit day) బిజినెస్.
హైదరాబాద్‌కు చెందిన ఈ స్టార్టప్ కంపెనీలో మహేశ్ బాబు పెట్టుబడులు పెట్టనున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. తాజా సమాచారం ప్రకారం ఫిట్ డే పోషకాహార విలువలు కలిగిన హెల్త్ సప్లిమెంట్స్ ప్రోటీన్, చిప్స్, ప్రోటీన్ బార్ లాంటి ఉత్పత్తులను అమ్మనుంది. ఇదిలా ఉంటే మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబీ 29 చేస్తున్నాడని తెలిసిందే.
గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ చిత్రం 2025 జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.ఓ వైపు ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోవైపు మల్టీపుల్ బిజినెస్ ప్లాన్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు మహేశ్ బాబు.
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?
Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు