Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు
Hema | కొన్ని రోజుల క్రితం చర్చనీయాంశంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో పోలీసులు ఫైనల్‌గా ఛార్జిషీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ నటి హేమ (hema) డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు.
Hema | కొన్ని రోజుల క్రితం చర్చనీయాంశంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో పోలీసులు ఫైనల్‌గా ఛార్జిషీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ నటి హేమ (hema) డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతోపాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని వివరించారు. పోలీసులు చార్జీషీట్లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు.
రేవ్ పార్టీ కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో నటి హేమను సస్పెండ్ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టులో హేమపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
కేసు సాగిందిలా..
మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు నిర్దారించారు. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హేమ వెళ్లలేదు. హేమ మొదట బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనప్పటికీ.. తాను వెళ్లలేదంటూ పలు వీడియోలు కూడా విడుదల చేసింది. కానీ పోలీసులు రిలీజ్ చేసిన హేమ ఫొటోలోని డ్రెస్, హేమ విడుదల చేసిన వీడియోల్లోని డ్రెస్ ఒకే విధంగా ఉండటంతో ఆమె పార్టీకి వెళ్లినట్టు నిర్దారణకు వచ్చారు.
Read Also :
Rana Daggubati | షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసిన రానా.. ఎందుకో తెలుసా..?
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sharwa 37 | బర్త్ డే స్పెషల్.. శర్వానంద్ 37లో సంయుక్తా మీనన్ పాత్ర ఇదే
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

