Sikandar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
సికిందర్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని తెలిసిందే. తాజాగా ఈ మూవీలో మరో భామ కూడా చేరిపోయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? టాలీవుడ్ కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నట్టు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. సికిందర్ టీంలోకి కాజల్‌కు స్వాగతం పలుకుతూ.. సెట్స్‌లో జాయిన్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
మరి మురుగదాస్ ఈ ఇద్దరు భామలను ఎలాంటి పాత్రల్లో చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో సికిందర్ ఉండబోతుందని బీటౌన్ సర్కిల్ సమాచారం. ఓ వైపు ఎమోషన్స్‌ను హైలెట్ చేస్తూనే.. మరోవైపు హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో సికిందర్ సాగనుందట. ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
#FilmfareExclusive: As per our sources, #KajalAggarwal is set to join #SalmanKhan and #RashmikaMandanna in #Sikandar.🎬🍿#News pic.twitter.com/I7qIhAqAih
— Filmfare (@filmfare) September 10, 2024
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్
Raghu Thatha | ఓటీటీలో కీర్తి సురేశ్ రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?