Suryapet : సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం (Muntaj Begum) కుటుంబానికి దక్కాల్సిన లేబర్ ఇన్సూరెన్స్ (Labour Insurance) డబ్బును కాంగ్రెస్ నేతలు కాజేశారు. ముంతాజ్ బేగం ఈమధ్యే చనిపోయింది. దాంతో.. ఆమె పేరుతో లేబర్ ఇన్సూరెన్స్ చెక్కు రాగా.. దానిని విత్ డ్రా చేసి డబ్బులు మింగేశారు.
ఈ విషయం తెలిసి ముంతాజ్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నేతలను నిలదీయగా.. రూ.50 వేలు మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మృతురాలి కూతురు నసీమా ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నమ్మించి కాంగ్రెస్ నాయకులు రూ.5,000 తీసుకొని మోసం చేశారని ఆమె వాపోయింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది.
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఘరానా మోసం
కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం అనే మహిళ చనిపోగా, ఆమె పేరుతో వచ్చిన లేబర్ ఇన్సూరెన్స్ చెక్కును విత్ డ్రా చేసి డబ్బును కాజేసిన కాంగ్రెస్ నాయకులు
విషయం తెలిసి అడగగా, రూ.50 వేలు ఇచ్చి మిగతా అమౌంట్ ఇవ్వకుండా… pic.twitter.com/GrCmhPzKwG
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2025