Vaibhav Suryavanshi : ఐపీఎల్లో సెంచరీతో క్రికెట్ సంచలనంగా పేరొందిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi )కి ప్రమోషన్ వచ్చింది. ఇటీవల వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్ను ఈ యంగ్‌స్టర్‌ను ఏకంగా అండర్-19 కెప్టెన్సీ వరించింది. వచ్చే ఏడాది జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో టీమిండియాకు ఈ చిచ్చరపిడుగు సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని శనివారం సెలెక్టర్లు వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన సందర్భంగా వెల్లడించారు.
ఈమధ్య కాలంలో శతకాల మోతతో అలరిస్తున్న వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రతిభావంతుడైన వైభవ్‌కు వరుసగా అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు అండర్ 19 ప్రపంచకప్ స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. అంతకంటే ముందు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడికి కెప్టెన్సీ కట్టబెట్టారు.
🚨 News 🚨
India’s U19 squad for South Africa tour and ICC Men’s U19 World Cup announced.
Details▶️https://t.co/z21VRlpvjg#U19WorldCup pic.twitter.com/bL8pkT5Ca2
— BCCI (@BCCI) December 27, 2025
జనవరి 3 నుంచి 7 వరకూ జరిగే దక్షిణాఫ్రికా సిరీస్‌కు రెగ్యులర్ సారథి ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రాలు దూరమయ్యారు. మణికట్టు గాయంతో బాధపడుతున్న వీరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకున్నాక వరల్డ్ కప్ కోసం జట్టుతో కలుస్తారు. దాంతో.. వీరిద్దరి గైర్హాజరీలో సఫారీ టూర్‌కు వైభవ్‌కు పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు. అతడికి డిప్యూటీగా అరోన్ జార్జ్ వ్యవహరిస్తాడు. టీనేజ్ సంచలనమైన వైభవ్ డిసెంబర్ 26న రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాల పురస్కార్‌ను స్వీకరించిన విషయం తెలిసిందే.
భారత స్క్వాడ్ (దక్షిణాఫ్రికా పర్యటనకు) : వైభవ్ సూర్యవంశీ(కెప్టెన్), అరోన్ జార్జ్(వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు(వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్(వికెట్ కీపర్), ఆర్.ఎస్ అంబ్రిస్, కనిష్క్ చౌహన్, ఖిలాన్ పటేల్, మొహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉద్దవ్ మోహన్, యువరాజ్ గొహిల్, రాముల్ కుమార్.
భారత స్క్వాడ్ (అండర్ -19 ప్రపంచకప్) : ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా(వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు(వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్(వికెట్ కీపర్), ఆర్.ఎస్ అంబ్రిస్, కనిష్క్ చౌహన్, ఖిలాన్ పటేల్, మొహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉద్దవ్ మోహన్.