Suriya 44 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమాల్లో ఒకటి సూర్య 44 (Suriya 44). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు.
సూర్య 44 షూటింగ్ ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి సందడి చేశాడు సూర్య. అభిమానులంతా సూర్యతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సూర్య టీం ప్రస్తుతం Thodupuzha లొకేషన్లో ఉంది. పీరియాడిక్ వార్ అండ్ లవ్ నేపథ్యంలో ఈ చిత్రానికి తిరు, 24, పేటా ఫేం ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
సూర్య హోంబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 పొంగళ్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు . ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అండమాన్ ఐలాండ్‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది సూర్య టీం. అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు సూర్య, పూజాహెగ్డేపై వచ్చే సాంగ్స్‌ను చిత్రీకరించారని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే బీచ్‌లో స్టైలిష్‌గా కూర్చున్న లుక్‌తోపాటు సెట్స్‌లో సూర్య, పూజాహెగ్డే దిగిన స్టిల్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే షేర్ చేసిన షూటింగ్ లొకేషన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
#Suriya with fans at #Suriya44 location, Thodupuzha, Kerala 📸 pic.twitter.com/5RGEkGJ8yT
— AB George (@AbGeorge_) September 9, 2024
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ .. స్పెషలేంటో మరి..!
Maa Nanna Superhero | క్యూరియాసిటీ పెంచుతోన్న సుధీర్ బాబు.. మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్ వైరల్
KA | కిరణ్ అబ్బవరం క టీంకు దుల్కర్ సల్మాన్ సపోర్ట్