Maa Nanna Superhero | ఈ ఏడాది హరోంహర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుధీర్‌బాబు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఇప్పటికే ఫాదర్స్ డేసందర్భంగా రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేశారు.
చేతక్ బండిపై కూరగాయలు తీసుకెళ్తున్న సుధీర్ బాబు, స్కూల్‌కెళ్తున్న చిన్నారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఫస్ట్ లుక్ పోస్టర్లో చూడొచ్చు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘లూసర్’ వెబ్‌సిరీస్ ఫేం అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్, సీఏఎమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించబోతున్నామని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు.
ఈ మూవీలో సాయిచంద్, షాయాజీషిండే, రాజు సుందరం, శకాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందిస్తుండగా..సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
Hi, this is Johnny 🙎🏻♂!
Meet his Superheroes on Sept 12th ❤️🔥#MNSHTeaser Out on Sept 12th.#MaNannaSuperhero In Cinemas this Dussehra ❤️🔥@isudheerbabu @sayajishinde #SaiChand @abhilashkankara @mahesh_films @actorshashank @jaymkrish @chandurdc @vcelluloidsoffl @cam_entmnts… pic.twitter.com/REoO5LxABT
— BA Raju’s Team (@baraju_SuperHit) September 9, 2024
Tamannaah | విఫల ప్రేమకథ.. బ్రేకప్ నిజంగా చాలా బాధాకరం: తమన్నా