Tamannaah | విఫల ప్రేమకథ.. బ్రేకప్ నిజంగా చాలా బాధాకరం: తమన్నా
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన విఫల ప్రేమకథల గురించి గుర్తుచేసుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఆమె హృదయం ఇప్పటికి రెండు సార్లు ముక్కలైందట.
Tamannaah | ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన విఫల ప్రేమకథల గురించి గుర్తుచేసుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఆమె హృదయం ఇప్పటికి రెండు సార్లు ముక్కలైందట. ఈ విషయంపై తమన్నా మాట్లాడుతూ ‘బ్రేకప్ నిజంగా చాలా బాధాకరం. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. నా జీవితంలో రెండుసార్లు బ్రేకప్‌ని ఎదుర్కొన్నాను. టీనేజ్‌లో ఉన్నప్పుడే తొలి హార్ట్‌బ్రేక్ ఎదురైంది.
జీవితంలో ఏదోఒకటి సాధించాలనేది నా అభిమతం. ఓ వ్యక్తికోసం లక్ష్యాన్ని వదులుకోవడం నచ్చలేదు. ఆ కారణంలో ఓ బంధం తెగిపోయింది. అది జరిగిన కొన్నేళ్ల తర్వాత ఓ వ్యక్తిని ఇష్టపడ్డా. అతనితో కొంతకాలం రిలేషన్లో ఉన్నా. అతను మాట్లాడితే అబద్ధాలే. అనవసరంగా అబద్ధాలాడేవాళ్లంటే నాకు అసహ్యం. తను నాకు సెట్ కాడని మనసు చెప్పింది. దాంతో అతడ్ని కట్ చేయక తప్పలేదు.’ అని గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

