KA | రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా చిత్రం క (KA). సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా వస్తోంది. ఈ చిత్రం మలయాళ వెర్షన్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది.
క మూవీని కేరళలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హోం ప్రొడక్షన్ హౌజ్ వేఫరెర్ ఫిలిమ్ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది దుల్కర్ సల్మాన్ టీం. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సరికొత్త కథాంశంతో క ఉండబోతున్నట్టు టీజర్ చెప్పకనే చెబుతోంది. క చిత్రంలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Prestigious Production @DQsWayfarerFilm – A @dulQuer Enterprise releasing @Kiran_Abbavaram‘s most ambitious period drama #KA in Malayalam (WW)❤️🔥
A @SamCSmusic Musical🎶@UrsNayan @DirSujith @sandeep_deep02 #ChintaGopalaKrishnaReddy @srichakraas @KA_Productions_ @saregamasouth pic.twitter.com/urLjuFpHXL
— BA Raju’s Team (@baraju_SuperHit) September 9, 2024
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ .. స్పెషలేంటో మరి..!
Maa Nanna Superhero | క్యూరియాసిటీ పెంచుతోన్న సుధీర్ బాబు.. మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్ వైరల్