Raghu Thatha | నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh) లీడ్ రోల్లో నటించిన చిత్రం రఘు తాతా (Raghu Thatha). సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రఘుతాతా తమిళ ప్రజలపై హిందీని రుద్దే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ ప్రాంచైజీలను తెరకెక్కించిన పాపులర్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించింది.
కీర్తిసురేశ్ రఘుతాతా ఇక ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఇంకేంటి మరి థియేటర్లో సినిమాను మిస్సయితే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ చిత్రంలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతం అందించాడు.
ఓటీటీలో రఘు తాతా..
Get ready for a hilarious family blockbuster!😂💥#RaghuThatha will be streaming from September 13th only on ZEE5 in Tamil, Telugu, and Kannada.@KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh @tejlabani @mdeii… pic.twitter.com/DpCcA8XfAA
— ZEE5 Tamil (@ZEE5Tamil) September 9, 2024
Suriya 44 | సూర్య 44 లొకేషన్లో అభిమానులతో.. సూర్య ఇంతకీ ఎక్కడున్నాడంటే..?
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ .. స్పెషలేంటో మరి..!
Maa Nanna Superhero | క్యూరియాసిటీ పెంచుతోన్న సుధీర్ బాబు.. మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్ వైరల్
KA | కిరణ్ అబ్బవరం క టీంకు దుల్కర్ సల్మాన్ సపోర్ట్