Devara | గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది తారక్ టీం.
దేవర ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నారు. తారక్ అండ్ టీం ప్రమోషన్స్‌లో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో స్పెషల్ ప్రమోషనల్ ఎపిసోడ్లో పాల్గొన్నారు. తారక్, సైఫ్ అలీఖాన్ ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో స్టైలిష్‌గా కనిపించగా.. జాన్వీకపూర్ నీలం రంగు చమ్కీల డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తూ హొయలు పోయింది. దేవర ప్రమోషనల్ స్టిల్స్, విజువల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#Devara promotions lo Jhanvi papa 🤩#JrNtr #JhanviKapoor pic.twitter.com/WN5mJnTH0K
— Virat AA Fan (@sunnyteju2) September 9, 2024
Seems like Mumbai now has a lot of FORCE to handle 😉🔥🌊#DevaraTrailer tomorrow at 5:04PM.#Devara @tarak9999 pic.twitter.com/ndRiyedUPm
— Devara (@DevaraMovie) September 9, 2024
Suriya 44 | సూర్య 44 లొకేషన్లో అభిమానులతో.. సూర్య ఇంతకీ ఎక్కడున్నాడంటే..?
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ .. స్పెషలేంటో మరి..!
Maa Nanna Superhero | క్యూరియాసిటీ పెంచుతోన్న సుధీర్ బాబు.. మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్ వైరల్
KA | కిరణ్ అబ్బవరం క టీంకు దుల్కర్ సల్మాన్ సపోర్ట్