Crude oil | వెనెజువెలాపై సైనిక దాడుల ఎఫెక్ట్.. ముడి చమురు ధరలు పెరిగే ఛాన్స్.!
Crude oil | అమెరికా-వెనెజువెలా సంక్షోభం సముద్ర మార్గంలో ఇబ్బందులకు దారితీయవచ్చని, ఈ దారిగుండానే ప్రపంచంలోనే వెండి ఎగుమతుల్లో దూసుకుపోతున్న పెరు, చాద్ దేశాలు సిల్వర్ ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు గుర్తుచేస్తున్నారు.
Crude oil | న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌కు మరో దెబ్బ. వెనెజువెలాపై అగ్రరాజ్యం సైనిక దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయిప్పుడు. ఈ నేపథ్యంలోనే ముడి చమురు, బంగారం, వెండి తదితర కమోడిటీల ధరలకు రెక్కలు తొడుగుతాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వెనెజువెలా ఆర్థిక వ్యవస్థ అంత పెద్దదేమీ కాదంటున్న ఆర్థిక నిపుణులు.. భారతీయ స్టాక్ మార్కెట్లపై ఈ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవచ్చనే చెప్తున్నారు. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్, క్రూడాయిల్ ఇతర కమోడిటీ ట్రేడింగ్ తప్పక ప్రభావితం కాగలదని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ సంగతి..
సోమవారం ఫ్యూచర్ మార్కెట్ కొమెక్స్లో గోల్డ్ ధర ఔన్స్ 4,380 డాలర్లను తాకవచ్చని, సిల్వర్ కూడా 75-78 డాలర్లను చేరవచ్చని యా వెల్త్ డైరెక్టర్ అనుజ్ గుప్తా అన్నారు. దీంతో స్పాట్ మార్కెట్లోనూ ఔన్స్ గోల్డ్ రూ.4,450 డాలర్లు, ఔన్స్ సిల్వర్ 80 డాలర్లు పలుకవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇక భారతీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లోనూ బంగారం ధర 24 క్యారెట్ 10 గ్రాములు రూ.1,40,000గా నమోదు కావచ్చని, వెండి కిలో రూ.2,45,000ను తాకవచ్చన్నారు.
అమెరికా-వెనెజువెలా సంక్షోభం సముద్ర మార్గంలో ఇబ్బందులకు దారితీయవచ్చని, ఈ దారిగుండానే ప్రపంచంలోనే వెండి ఎగుమతుల్లో దూసుకుపోతున్న పెరు, చాద్ దేశాలు సిల్వర్ ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ఈ దెబ్బకు గోల్డ్ ధరలు కొండెక్కుతాయని అంటున్నారు. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పరుగుకు పట్టపగ్గాలనేవే ఉండకపోవచ్చు. ఇక ముడి చమురు విషయానికొస్తే.. ఎంసీఎక్స్‌పై బ్యారెల్ 5,200-5,300 డాలర్లను చేరే వీలుందన్నారు.
Read Also :
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

