Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ డ్రామా మూవీలో ప్రభాస్‌ను అభిమానులు ఎప్పటినుంచో చూడాలని కోరుకున్న ఫుల్ ఎంటర్టైనర్ అవతార్‌లో చూపించబోతున్నారు. ప్రభాస్ నుంచి కొన్నేళ్లుగా మిస్ అవుతున్న మాస్ ఎలిమెంట్స్, కామెడీ, ఎనర్జిటిక్ ప్రెజెన్స్ అన్నీ ఈ సినిమాలో కనిపించనున్నాయని చిత్ర యూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ నుంచి సాలిడ్ డ్యాన్స్ మూమెంట్స్ చూడబోతుండటం ఫ్యాన్స్‌లో మరింత హైప్‌ను పెంచుతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ‘రెబల్ సాబ్’ మరియు ‘సహానా సహానా’ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మ్యూజిక్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘నాచే నాచే’ను విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయింది. బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రంలోని ‘నాచే నాచే’ పాటను రీమిక్స్ చేస్తూ, సంగీత దర్శకుడు థమన్ క్యాచీ ట్యూన్స్ అందించగా ప్రభాస్ అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రోమోకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. పూర్తి కలర్‌ఫుల్ సెటప్‌లో రూపొందిన ఈ పాటలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టేజ్‌పై చిందులు వేయనున్నాడు.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ గ్లామర్ ఫీస్ట్‌తో పాటు ప్రభాస్‌కు స్టన్నింగ్ డ్యాన్స్ స్టెప్పులు వేయించనున్నారని ప్రోమో చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ప్రోమో ఆసక్తికరంగా ఉండటంతో ‘నాచే నాచే’ ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ వీడియో సాంగ్‌ని జనవరి 5న విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో డిఫరెంట్ ఎంటర్టైనర్గా నిలవనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.