BCCI : టోర్నీ ఏదైనా విధ్వంసక శతకాలతో రెచ్చిపోతున్న వైభవ్ సూర్యవంశీ() మరో బిగ్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. ఇటీవలే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌తో పాటు అండర్ -19 ఆసియాకప్‌లో సెంచరీలతో చెలరేగిన వైభవ్‌కు ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్(ICC Mens Under-19 World Cup) స్క్వాడ్‌లో చోటు దక్కింది. వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న ఈ ఈవెంట్ కోసం ఆయుష్ మాత్రే (Ayush Mhatre) కెప్టెన్‌గా శనివారం 15 మందితో కూడిన బృందాన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్ విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇప్పటికే ఐదుసార్లు అండర్ -19 ప్రపంచకప్ గెలుపొందిన భారత్ ఆరో టైటిల్‌పై కన్నేసింది. ఈ మెగా సన్నాహకాల్లో టీమిండియా త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దాంతో.. ఈ వన్డే సిరీస్‌తో పాటు ప్రపంచకప్ కోసం శనివారం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. ఆయుష్ మాత్రే సారథిగా, విహాన్ మల్హోత్రా డిప్యూటీగా పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు.
🚨 News 🚨
India’s U19 squad for South Africa tour and ICC Men’s U19 World Cup announced.
Details▶️https://t.co/z21VRlpvjg#U19WorldCup pic.twitter.com/bL8pkT5Ca2
— BCCI (@BCCI) December 27, 2025
ఈ పదిహేనే మందిలో ఇటీవలే ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన వైభవ్, అరోన్, అభిగ్యాన్, దీపేశ్లు ఉన్నారు. నమీబియా, జింబాబ్వే వేదికగా అండర్ -19 ప్రపంచకప్ జరుగనుంది. గ్రూప్ -బీలో ఉన్న భారత జట్టు లీగ్ దశలో యూఎస్ఏ, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
భారత స్క్వాడ్ : ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా(వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు(వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్(వికెట్ కీపర్), ఆర్.ఎస్ అంబ్రిస్, కనిష్క్ చౌహన్, ఖిలాన్ పటేల్, మొహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉద్దవ్ మోహన్.
ఐపీఎల్లో 35 బంతుల్లోనే సెంచరీతో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ జూనియర్ స్థాయిలో దంచేస్తున్నాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్, అండర్ -19 ఆసియాకప్‌లో మెరుపు శతకాలు బాదిన ఈ చిచ్చరపిడుగు.. విజయ్ హజారే ట్రోఫీలో 190 పరుగులతో విరుచుకుపడ్డాడు. అయితే.. రైజింగ్ స్టార్స్, ఆసియాకప్‌లో లీగ్ దశలో దంచేసిన వైభవ్ కీలకమైన ఫైనల్లో తేలిపోయాడు. దాంతో.. ఈ కుర్రాడు బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా రాటుదేలాల్సిన అవసరం ఎంతో ఉంది.