Sikandar | బాలీవుడ్ సినీ జనాలతోపాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కూడా టీంలో జాయిన్ అయినట్టు వార్త కూడా అందించారు మేకర్స్. తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం కన్నడ సోయగం సల్లూభాయ్‌తో కలిసి యూరప్ చెక్కేయనుందట. ఓ రొమాంటిక్ సాంగ్ షూట్లో భాగంగా యూరప్ కు వెళ్తనున్నారని ఇన్సైడ్ టాక్. మొత్తానికి నేషనల్ క్రష్-సల్లూభాయ్ కాంబోను సిల్వర్ స్క్రీన్‌పై కలర్ఫుల్గా ప్రజెంట్ చేయబోతున్నాడని తాజా వార్త చెప్పకనే చెబుతోంది.
ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మురుగదాస్ సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో సికిందర్ తెరకెక్కిస్తున్నాడని బీటౌన్ సర్కిల్ సమాచారం. సికిందర్లో ఓ వైపు ఎమోషన్స్‌ను హైలెట్ చేస్తూనే.. మరోవైపు హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి.
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Raghu Thatha | ఓటీటీలో కీర్తి సురేశ్ రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?